తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు .గత 70 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పర్యాటక ప్రదేశాల పట్ల నిర్లక్ష్యం వహించారు.
సీఎం కేసీఆర్ గారి విజన్ వల్ల గత 7 ఏండ్లలోనే తెలంగాణ పర్యాటక శాఖ 2 అంతర్జాతీయ స్థాయి అవార్డు లను కైవసం చేసుకుంది.
రాష్ట్రంలో క్రీడా పాలసీ మాదిరిగానే అత్యుత్తమ టూరిజం పాలసీ ని రూపొందించబోతున్నాము.
తెలంగాణ రాష్ట్రం లో ఎన్నో అద్భుతమైన పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి.సీఎం కేసీఆర్ గారు 1400 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయం ను నిర్మిస్తున్నారు.
అలాగే శంషాబాద్ ప్రాంతంలో చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామనుజ స్వామి దేవాలయం లు నిర్మాణం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక తెలంగాణ గా రూపాంతరం చెందుతోంది.
పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కి సర్క్యూట్ లను ఏర్పాటు చేసి అభివృద్ధి కి కృషి చేస్తున్నాము.దేశంలోనే 2090 ఎకరాల్లో మహబూబ్ నగర్ లో కేసీఆర్ ఎకో టూరిజం పార్క్ ను అభివృద్ధి చేస్తున్నాము.
సీఎం కేసీఆర్ గారి అద్భుత దూర దృష్టి తో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు కు అనుబంధం గా ఉన్న రిజర్వాయర్ లలో పర్యటకాభివృద్ధి కి మౌలిక సదుపాయాల కు పెద్ద పీట వేస్తున్నాము.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, MD టూరిజం మనోహర్ లు పాల్గొన్నారు.