సింగపూర్: మరణశిక్షపై సుప్రీంకోర్టులో భారత సంతతి వ్యక్తి అప్పీల్‌... విచారణ నిరవధిక వాయిదా

మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసినందుకు మరణశిక్షకు గురైన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం చేసుకున్న అప్పీల్‌పై విచారణను సింగపూర్ సుప్రీంకోర్ట్ నిరవధికంగా వాయిదా వేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.నాగేంద్రన్ తరపున కొత్త న్యాయవాది వైలెట్ నెట్టో వాయిదా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ది స్ట్రైయిట్స్ టైమ్స్ సోమవారం నివేదించింది.

 Indian-origin Drug Trafficker’s Death Sentence Appeal Adjourned In Singapore,-TeluguStop.com

కోర్టు కొత్త విచారణ తేదీని నిర్ణయించలేదని సమాచారం.వాస్తవానికి నాగేంద్రన్ అప్పీల్‌పై సోమవారం విచారణ జరగాల్సి వుంది.

తన మరణశిక్షను సవాల్ చేసేందుకు న్యాయపరమైన సమీక్ష ప్రక్రియను ప్రారంభించడానికి తనకు అనుమతిని నిరాకరించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాగేంద్రన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.ఈ అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ సుందరేశ్ మీనన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాశ్, బెలిండా ఆంగ్, చావో హిక్ టిన్‌లతో కూడిన ప్యానెల్ జనవరి 24న విచారణ జరుపుతామని ప్రకటించింది.

ఇకపోతే.సింగపూర్‌కు 42 గ్రాముల హెరాయిన్‌ సరఫరా చేశాడని నాగేంద్రన్‌పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి.అనంతరం అవి నిర్థారణ కావడంతో 2010లో ఆయనకు కోర్ట్ మరణశిక్ష విధించింది.దీంతో ధర్మలింగం న్యాయస్థానాల్లో పలుమార్లు అప్పీళ్లు చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు.చివరకు సింగపూర్ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరినన్నప్పటికీ అక్కడా నిరాశే ఎదురైంది.11 ఏళ్ల క్రితం పడిన మరణశిక్ష గతేడాది నవంబర్‌ 10వ తేదీన అమలు కావాల్సి ఉంది.చివరకు నాగేంద్రన్‌కు కొవిడ్‌ సోకడంతో మరణశిక్ష మరోసారి వాయిదా పడింది.ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ కేసుపై ఆసక్తి పెరిగింది.దీంతో విచారణ నాడు హైకోర్టు ప్రాంగణం మొత్తం అంతర్జాతీయ మీడియా, స్థానిక ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది.

Indian-origin Drug Trafficker’s Death Sentence Appeal Adjourned In Singapore, Singapore, Singapore Court,drugs, Malaysia, Malaysian-Indian, Mercy Petition, Mercy Petition Seeks Support To Save Malaysian-Indian From Gallows, Nagendran, Online Campaign - Telugu Drugs, Malaysia, Mercy, Nagendran, Singapore

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube