సీఎం జగన్ కు లేఖ రాసిన సీనియర్ నటుడు కైకాల.. ఎందుకంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు.గత ఏడాది నవంబరులో తీవ్ర అనారోగ్యం కారణంగా కైకాల సత్యనారాయణ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం అందరికి తెలిసిందే.

 Senior Actor Kaikala Satyanarayana Writes Thanking Letter To Ap Cm Ys Jagan For-TeluguStop.com

అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న కైకాల తాజాగా పరిస్థితి మెరుగవడంతో పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీనితో తన అనారోగ్యం సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం సంతోషం వేసింది అని, ఈ మేరకు కోలుకొని సీఎం జగన్ కు కృతజ్ఞత తెలుపుతూ లేఖ రాశారు.

తన ఆరోగ్య పరిస్థితులు బాగా లేని సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అనారోగ్య సమయంలో తనకు తన కుటుంబానికి అమూల్యమైన సహాయం అందించిన జగన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ అతను లేఖ రాశారు.

బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన పెద్ద మనస్సు కు చాలా సంతోషిస్తున్నాను అని కైకాల తన లేఖలో పేర్కొన్నారు.ఇక మీరు ఆదేశించిన విధంగానే ఉన్నత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని వైద్య ఖర్చులు తీర్చడానికి ఆర్థిక సహాయంతో అన్ని రకాలుగా సహాయాన్ని అందించారు.

Telugu Cm Ys Jagan, Letter, Tollywood-Movie

ఆ సమయాల్లో మీరు మాకు అందించిన సహాయం మా  కుటుంబానికి అద్భుత శక్తిని ఇచ్చింది అని కైకాల తెలిపారు.ఇక అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి అనుకుంటున్నాను అని చెబుతూ నూతన సంవత్సరం,సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.తాను సంతకం చేయలేని పరిస్థితిలో ఉండటంతో తన కొడుకు చేత కృతజ్ఞత లేఖ పై సంతకం చేస్తున్నాను అంటూ ఆయన వెల్లడించారు.ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube