అంతకుముందు తన డబ్బింగ్ సినిమాలతో హిందీ యూట్యూబ్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పతో డైరెక్ట్ బరిలో దిగి రచ్చ రచ్చ చేశాడు.స్ట్రైట్ బాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప సినిమా వసూళ్లు రాబట్టింది.
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వాళ్ల కాంబో స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది.ఇక ఈ సినిమా చూసిన మిగతా హీరోల ఫ్యాన్స్ మా హీరోకి ఓ పుష్ప లాంటి సినిమా కావాలని అంటున్నారు.
ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ మాకో పుష్ప పడాలని కోరుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో నట విశ్వరూపం చూపించే ఎన్.టి.ఆర్ తన సత్తా చాటుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు నేషనల్ వైడ్ గా ఎన్.టి.ఆర్ హంగామా షురూచేస్తాడు.ఆ నెక్స్ట్ వెంటనే ఎన్.టి.ఆర్ కి పుష్ప లాంటి సినిమా పడితే తారక్ కూడా నేషనల్ వైడ్ దుమ్ముదులిపే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.పుష్ప అల్లు అర్జున్ కి తన రేంజ్ పెంచగా అలాంటి ఫోర్స్ ఉన్న సినిమా ఎన్.టి.ఆర్ కి పడితే ఇండియన్ సినిమా రికార్డులు షేక్ అవుతాయని చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ చేసే సినిమా అంతకుమించి ఉంటుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.