అగ్ర రాజ్యం అమెరికా అన్ని రంగాలతో పాటు కరోన లో కూడా అగ్ర స్థానంలో నిలుస్తోంది.పెద్దన్న హోదాలో అందరికి సుద్దులు చెప్పే అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య ఏ స్థాయిలో ఉందంటే అక్కడి న్యూజెర్సీ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేవలం ఒక్క రోజులో 11 లక్షల కేసులు నమోదయ్యాయి, హాస్పటల్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.రోజు వారి రోగుల సంఖ్య పెరగడంతో వైద్యులు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది.కేవలం ఒక్క రోజులో 11 .30 లక్షల కేసులు బయట పడ్డాయంటే అమెరికాలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
న్యూజెర్సీ, డెలావర్, మేరీ ల్యాండ్, ఒహియో, వాషింగ్టన్ వర్జీనియా పెన్సిల్వేనియా వంటి పలు రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అమెరికాలో సగానికి పైగా జనాభా కేవలం రెండు నెలల్లో కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇదిలాఉంటే అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.ప్రతీ రోజు ఒమెక్రాన్ కేసుల సంఖ్య 35 వేలు పైనే నమోదు కావడంతో స్థానిక ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది.
దాంతో.
న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కరోన కేసులు పెరుగుతున్న క్రమంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతామని, అందరికి వైద్యం అందేలా చర్యలు చేపడుతామని ప్రకటించారు.
ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని, అవసరమైన పరిస్థితిలో మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతులు ఉంటాయని, మాస్క్ లేనిదే బయటకి రావద్దని సూచించారు.ఇదిలాఉంటే కేవలం న్యూజర్సీలో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.