ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లలో ఎన్నో రకాల ఆప్స్ ఉండటం వల్ల ఎంతోమంది సాంకేతికతను ఉపయోగించి వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నారు.ఇక పోతే ఈ యాప్ ద్వారా చాలా మంది మహిళలు అశ్లీల వీడియోలను వారి మాట తీరును వినలేక పోతున్నాము అని ఇలాంటి మహిళలు ఎక్కడ ఉన్న వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ప్రముఖ దర్శకుడు పేరరసు కోరారు.రెయిన్బో ప్రొడక్షన్స్ బ్యానరులో నిర్మాత వరదరాజ్ నిర్మించిన ‘పెణ్ విలై వెరుం రూ.999 మట్టుమే’ చిత్ర ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా ముఖ్యంగా మహిళలపై జరిగే అత్యాచారాలు అరాచకాల గురించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. సాధారణంగా ప్రతి రోజూ ఇలాంటి అరాచకాలు జరుగుతున్న నేపథ్యంలో పురుషుల వల్ల ఈ విధమైనటువంటి అరాచకాలు ఎక్కువవుతున్నాయని చాలామంది భావిస్తారు నిజానికి ఇలాంటి వాటి వెనక మహిళల హస్తం కూడా ఉందని ఆయన తెలిపారు.
టిక్ టాక్ వీడియోల ద్వారా మహిళలు చేస్తున్న అరాచకాలను భరించలేకపోతున్నాము.మహిళలు ఎంతో దిగజారుడు మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలను వినలేక పోతున్నాము.ఇలాంటి మహిళల వల్ల ఎంతోమంది చెడిపోయే ప్రమాదం ఉంది.అందుకే ఇలాంటి వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు.
ముఖ్యంగా చిన్నపిల్లల చేతులలో ఫోన్లు కనిపించకుండా ప్రతి ఒక్క తల్లి తండ్రి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.