బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రేక్షకులందరికీ పరిచయమే.మోడల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది.
తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాలలో కూడా నటించింది.
తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.
తొలిసారిగా 1993లో బాజిగర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.తెలుగులో సాహస వీరుడు సాగర కన్య సినిమాతో అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈమె కొన్ని స్పెషల్ సాంగు లలో కూడా మెప్పించింది.
ఆ తర్వాత 2010 లో సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
కారణం 2009లో రాజ్ కుంద్రా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోగా.పెళ్లి జీవితం కోసం సినిమాలను వదులుకుంది.
రాజ్ కుంద్రా కు ఇదివరకే మరో యువతితో వివాహం జరుగగా ఆమెను వదిలేసి శిల్పా శెట్టిని రెండో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా కాలం నుంచి మంచిగా కొనసాగుతుంది.
కానీ గత ఏడాది మాత్రం వీరి ఇంట్లో తుఫాను చెలరేగింది.శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రీకరణను చేస్తూ వాటిని ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు గత ఏడాది వార్తల్లోకి ఎక్కాడు.వెబ్ సిరీస్ ల అవకాశాల పేరుతో ఎంతోమంది యువతులను తన వైపు లాక్కుని వాళ్లతో అటువంటి చిత్రాలు తీస్తున్నాడని ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఆ సమయంలో అతడి గురించి మరెన్నో కోణాలు కూడా బయట పడ్డాయి.
ఇక శిల్పా శెట్టి వ్యవహారం కూడా ఇందులో ఉందేమో అని అనుమానం రావడంతో అందులో తనది ఎటువంటి పాత్ర లేదని తెలిసింది.ఇక శిల్పా శెట్టి మొత్తానికి తన భర్త ఇలా చేయడంతో అతడి నుండి విడిపోతుందని పలు మీడియాలు కూడా చర్చలు చేశాయి.
కానీ కొంత కాలం తర్వాత రాజ్ కుంద్రా కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అందటంతో అతడు బయటకు వచ్చాడు.దీంతో అతడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు.తన భార్య శిల్పాశెట్టి తో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తున్నాడు.ఈసారి శిల్పా శెట్టి తన భర్తతో కలిసి షిరిడి సాయిబాబా సన్నిధిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది.
దానికి సంబంధించిన వీడియోను శిల్పా శెట్టి తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.అందులో దేవుడు ఒక్కడే అని.శ్రద్ధ, పట్టుదల.ఓం సాయి రాం అనే కాప్షన్ ఇవ్వగా.
అందులో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దేవుడి ముందు చేతులు జోడించి సాయిబాబాకు దండం పెడుతున్నట్లు కనిపించింది.మొత్తానికి గత ఏడాది పీడకలగా మారిన తమ జీవితం అన్నీ పూర్తి చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్లి తమ తప్పులను ఒప్పుకుంటున్నారు.