సినీ పెద్దగా నేనుండను.. ఆ పంచాయితీలు చెయ్యను.. మెగాస్టార్ షాకింగ్ నిర్ణయం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న గౌరవం గురించి అందరికీ తెలిసిందే.సీనియర్ నటులలో ఆయన ఒకరు.

 Megastar Shocking Decision About Industry, Chiranjeevi, Tollywood, Hero, Film In-TeluguStop.com

కానీ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.ఇప్పటికీ తన నటనలో, డాన్స్ లో ఎక్కడ కూడా ఎనర్జీని తగ్గించుకోలేదు చిరు.

పైగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఈ వయసులో కూడా చిరంజీవి ఎనర్జీ గురించి చాలా మంది యంగ్ హీరోలు మాట్లాడుకున్నారు.

గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.తను ఒక్కడే కాకుండా తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఒక నటుడుగా ఎంత మంచి హోదా సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి గుర్తింపు అందుకున్నాడు.

వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది ప్రజలను అభిమానులుగా మార్చుకున్నాడు.

ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలా ఉంటుందన్నమాట.సినీ ఇండస్ట్రీలో కూడా చిరంజీవికి నటుడుగా కంటే వ్యక్తిగతంగా ఒక గుర్తింపు ఉంది.

ఆయన ఎంతో మంది ప్రజలను, ఇండస్ట్రీకి చెందిన నటీనటులను ఆపద సమయంలో ఆదుకొని మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు.

Telugu Chiranjeevi, Tollywood-Movie

ఇప్పటికే చిరంజీవి ఎంతో మంది ప్రజలకు ఆర్థికంగా సహాయం చేశాడు.సొంతంగా బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశాడు.కోవిడ్ సమయంలో కూడా వెనకాడలేదు చిరంజీవి.

దీంతో చిరంజీవి గొప్పతనం చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవిని పెద్ద దిక్కుగా చూడాలని అనుకుంటున్నారు.

కొందరు మాత్రం చిరంజీవికి  ఆ హోదాను ఇచ్చేశారు.

గతంలో రాజకీయ నాయకుడు వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని అనుకున్నారు.కానీ చిరంజీవి ఆ హోదాను వద్దనుకుంటున్నట్లు తాజాగా తెలిసింది.

ప్రస్తుతం దాసరి నారాయణ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్న సంగతి తెలిసిందే.

కానీ ఈయన తర్వాత పెద్ద దిక్కు ఎవరు అని ప్రశ్నలు బాగా ఎదురయ్యాయి.

ఇక దీంతో చిరంజీవి పేరు బాగా వినిపించింది.కొందరు మాత్రం చిరంజీవిని పెద్దదిక్కుగా చూడాలని అనుకోవడం లేదు.

ఎందుకంటే వారికి వ్యక్తి గతంగా కాస్త వ్యతిరేకత ఉండటం వల్ల చిరంజీవిని సపోర్ట్ చేయలేకపోతున్నారు.ఇక తాజాగా చిరంజీవి కూడా టాలీవుడ్ పెద్దరికం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సినీ పరిశ్రమ పెద్ద గా తాను ఉండనని క్లారిటీగా ఇచ్చాడు.ఆ స్థానం తనకు వద్దని.

పంచాయితీలు చెయ్యనని తేల్చిచెప్పాడు.ఇక సినీ ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవటం తనకు ఇష్టం లేదని తన మనసులో మాటలను బయటకు చెప్పాడు.

అంతే కాకుండా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మాత్రం ముందుకు రానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Telugu Chiranjeevi, Tollywood-Movie

కానీ సినీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని క్లారిటీ ఇచ్చాడు.మొత్తానికి చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.చాలామంది చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చూడాలనుకున్నారు.

కానీ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడంతో చాలామంది నిరాశ చెందుతున్నారు.

చిరంజీవి ఈ పెద్దరికాన్ని వద్దనడంతో బాగా చర్చలు జరుగుతున్నాయి.

వార్తలలో కూడా ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు ఉంటారని ప్రశ్నార్థకంగా మారింది.

ఇక కొందరు చిరంజీవి తీసుకున్న నిర్ణయం సరైనదని.ఎందుకంటే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని ఈ సమయంలో పెద్దదిక్కుగా బాధ్యతలు తీసుకోవడం కష్టమని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube