నాపై కక్షకట్టారు.. చంపేయాలని చూస్తున్నారు: కరాటే కల్యాణి

తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Karate Kalyani Approaches Police Over Life Threat, Karate Kalyani, Tollywood, Bi-TeluguStop.com

అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నటించింది.అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరాటే కళ్యాణి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

ఈమె సీనియర్ నటి గా, బిజెపి నాయకురాలిగా చాలామందికి సుపరిచితమే.

ఇకపోతే ఈ మధ్య కాలంలో అయితే టీవీ సీరియల్స్ లో బిజీ బిజీ గా మారింది.ఈమె ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

బిగ్ బాస్, సీరియల్స్ ద్వారా కంటే ఈమె వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది.ఇకపోతే టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా కరాటే కళ్యాణి తన ప్రాణానికి ముప్పు ఉంది తనకు రక్షణ కల్పించాలి అంటూ తాజాగా శనివారం రోజున హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telugu Bigg Boss, Karate Kalyani, Tollywood-Movie

ఒక హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి,ఒక ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసింది అని బయట పెడుతున్నందుకు తనపై కక్ష కట్టి మరీ తనను హతమార్చాలని చూస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది.ఇక కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ఇక బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి హౌస్ లో తన ఆటలతో, పాటలతో ఎంత మంది ప్రేక్షకులను అలరించింది.

అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా చేరువ అయ్యింది.ఇప్పటికే బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube