దుబాయ్ లో దుమ్ములేపుతున్న విగ్నేష్ శివన్, నయనతార.. న్యూ ఇయర్ కు ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీని లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సినిమాలలో దూసుకుపోతున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా సినిమా డేట్ ఫిక్స్ చేశారు.

 Vignesh Sivan And Nayantara In Dubai Do You Know How Much They Spend For The New-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.గత కొంతకాలం నుంచి వీరిద్దరి డేటింగ్ లో ఉంటూ ఎక్కడికి వెళ్లిన జంటగా కనపడుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు.

ఇకపోతే వీరు నిశ్చితార్థం కూడా జరుపుకున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.నయనతార ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు నిర్మాతగా కూడా మారారు.

తన ప్రియుడితో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈమె సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.ఇకపోతే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎంతో మంది సెలబ్రిటీలు విదేశాలకు పయనమయ్యారు.

ఇప్పటికే మహేష్ బాబు,డైరెక్టర్ వంశీ పైడిపల్లి వంటివారు దుబాయ్ కి వెళ్లి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Dubai, Nayantra, Vignesh Sivan-Movie

ఈ క్రమంలోనే నయనతార, విగ్నేష్ శివన్ జంట కూడా దుబాయ్ వెళ్లి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దుబాయ్ లోని ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా వద్ద నూతన సంవత్సరానికి ఆ జంట స్వాగతం పలికింది.ఆ వీడియోను విఘ్నేశ్ ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ జంట కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకరినొకరు కౌగలించుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియ చేసుకున్నారు.

Telugu Dubai, Nayantra, Vignesh Sivan-Movie

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వసంత్ రవి, భారతి రాజా కీలక పాత్రలలో రాకీఅనే సినిమాకి నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ నిర్మాతలుగా ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.ఇకపోతే ఈ జంట దుబాయిలో నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలకడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.దుబాయ్ లో ఈ జంట నూతన సంవత్సర వేడుకలకు జరుపుకోవడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సమాచారం.ఎంతైనా లేడీ సూపర్ స్టార్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube