న్యూయార్క్: ఒమిక్రాన్ భయాలు.. ఆసుపత్రుల్లో పెరుగుతున్న చిన్నారుల చేరికలు

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒక్కొక్క దేశంలోకి అడుగుపెడుతూ ఈ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.

 Us: New York Sees Increase In Hospitalized Children,us, New York, Omicron Cases,-TeluguStop.com

ప్రస్తుతం దక్షిణాఫ్రికా, బ్రిటన్‌‌, అమెరికాలు ఒమిక్రాన్‌తో అల్లాడుతున్నాయి.వేగంగా వ్యాపించే గుణమున్న ఈ వేరియంట్‌ను ఎలా కట్టడి చేయాలో తెలియక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి.

అటు భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.మనదేశంలో ఇప్పటివరకూ 578 మంది ఈ వేరియంట్ బారినపడ్డారు.

అత్యధికంగా మహారాష్ట్రలో ఈ కేసులున్నాయి.పరిస్ధితి తీవ్రత దృష్ట్యా మళ్లీ రాష్ట్రాలన్నీ ఆంక్షల బాటలో నడుస్తున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూయార్క్ వేడుకలపై ఆంక్షలు విధించగా.రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలు సైతం ఇదే దారిలో నడిచే అవకాశం వుంది.

ఈ సంగతి పక్కనబెడితే.అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య ఇటీవలి వారాల్లో గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

పిల్లల ఆసుపత్రుల్లో కొవిడ్‌తో సంబంధం ఉన్న కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని న్యూయార్క్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌ హెచ్చరించింది.డిసెంబర్‌ 5న ప్రారంభమైన వారం నుంచి నేటీ వరకు 18 ఏళ్ల లోపు వారిలో కొవిడ్ సంబంధిత ఆసుపత్రి చేరికలు నాలుగు రెట్లు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.వీరిలో దాదాపు సగం మంది ఐదేళ్లలోపు వారేనని తెలిపింది.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.ప్రస్తుతం ఐదేళ్లలోపు వారు టీకా తీసుకునేందుకు అర్హులు కాదని పేర్కొంది.

కాగా.ఇప్పటికే అమెరికాలో డెల్టాను మించి ఒమిక్రాన్ కేసులు విస్తరిస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది.జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో డెల్టాకేసులు 27 శాతానికి పడిపోతే… 73 శాతం ఒమిక్రాన్ కేసులు పెరిగినట్లు వెల్లడించింది.

మరోవైపు గత వారం వ్యవధిలో సగటున రోజుకు 1,90,000 కేసులు నమోదైనట్లు జాన్స్‌హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.పరిస్ధితి ఇంత దారుణంగా వున్నప్పటికీ అమెరికన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మాస్క్ లేకుండా… వ్యాక్సిన్ తీసుకోకుండా యదేచ్ఛగా తిరుగుతున్నారని నిపుణులు మండిపడుతున్నారు.కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా వుండాలని ఆంటోనీ ఫౌచీ వంటి వారు స్వయంగా హెచ్చరిస్తున్నారు.

New York sees increase in hospitalized children

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube