23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు టీమ్ ఇండియా టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.వాస్తవానికి భజ్జీ 2016 నుంచి ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఆడలేదు.
జాతీయ జట్టులో స్థానం కోసం వేచి చూసి చూసి చివరికి అతను ఐదేళ్ల తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించారు.అయితే తాజాగా హర్భజన్ సింగ్ తన రాజీనామా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనని జాతీయ జట్టు నుంచి ఎందుకు తొలగించారో ఏమో అని హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.తాను బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ తనకి అవకాశం ఇవ్వలేదని ఆయన పరోక్షంగా టీమిండియా సెలెక్టర్లు, బీసీసీఐపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏ గుర్తింపు లేని తనకు మంచి పేరు దక్కిందంటే దానికి కారణం ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీయే అని హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.తనలో ప్రతిభ ఉందని, బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని దాదా గుర్తించారని భజ్జీ తెలిపాడు.
తాను సత్తా చాటగలనని దాదాకు తెలుసు కాబట్టే తన కోసం పోరాడి జట్టులో స్థానం కల్పించారని భజ్జీ చెప్పుకొచ్చారు.లైఫ్ తో పాటు కెరీర్ లో కూడా మార్గనిర్దేశం చేసి తనకు గంగూలీ అసలైన నాయకుడు అయ్యాడని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.
అయితే తనని జట్టు నుంచి తప్పించడానికి అసలైన కారణం ఏంటో తెలియనప్పుడు చాలా ఆలోచనలు వస్తాయని అన్నారు.
టీమిండియా నుంచి తనని ఎందుకు తొలగించారో చెప్పాల్సిందిగా చాలా మందిని అడిగినప్పటికీ ఎవరి నుంచి సమాధానం రాలేదని భజ్జీ అసహనం వ్యక్తం చేశారు.31 ఏళ్ల వయసులోనే తాను 400 వికెట్లను పడగొట్టానని.ఇంకొక రెండు మూడు సంవత్సరాల పాటు తనని జట్టులో నుంచి తీసి వేయకపోతే 500 మైలురాయిని ఈజీగా అందుకునే వాణ్ణినని భజ్జీ చెప్పుకొచ్చారు.
కానీ తనకు అవసరమైనప్పుడు భారత క్రికెట్లో ఎవరు కూడా తనకు మద్దతుగా మాట్లాడలేదని.ఇది విషాదకర పరిస్థితికి నిదర్శనమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.