కీపర్.. సూపర్.. జోస్ పట్టిన క్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా..

క్రికెట్ మొదలైందంటే ఫ్యాన్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు.క్రికెట్ ఫ్యాన్స్‌ టీ20 మొదలు టెస్టు మ్యాచ్ వరకు దేనినీ వదిలి పెట్టరు.

 Keeper .. Super .. Cricket Fans Pay For Jose's Catch .., Cricket, Viral Video, S-TeluguStop.com

మ్యాచ్ వస్తున్నంత సేపు టీవీలకే అతుక్కుపోతారు.ఇక మ్యాచ్‌లో ఆటగాళ్లు చేసే కొన్ని పనులకు ఆశ్చర్యపోతారు.

దానిని హైలెట్ చేయడంలోనూ ముందుంటారు.తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

ఇందులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.స్టువర్డ్ బ్రాడ్ ఫస్ట్ వికేట్ తీసేందుకు చాలా ట్రై చేశాడు.

ఇందుకు కీపర్ జోస్ బట్లర్ అద్భుతమైన ప్రదర్శన తోడవడంతో ఇంగ్లాండ్ ఆటగాడు పెవీలియన్ బాట పట్టక తప్పలేదు.కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న జేమ్స్, స్టువర్ట్ బ్రాడ్ ప్రస్తుతం రెండో టెస్టులో భాగంగా టీంలోకి వచ్చారు.

ఇక గురువారం మ్యాచ్ ప్రారంభం కాగానే.బ్రాడ్.

లెగ్‌సైడ్ డౌన్ బౌలింగ్ వేశాడు.ఆసీస్ బ్యాట్స్‌మెన్ హారిస్, సింపుల్ షాట్ కోసం ట్రై చేశాడు.

కానీ షాట్‌ కొట్టే టైమింగ్ కాస్త మిస్ కావడంతో బాల్ బ్యాట్ కు తగిలింది.అప్పటికే కీపింగ్‌లో ఉన్న బట్లర్ ఎలాంటి తడబాటు లేకుండా గాల్లో ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం వైరల్ గా మారింది.

క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం జోస్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు.ఇదిలా ఉండగా.ఆస్ట్రేలియా టీంకు సంబంధించి టెస్ట్ మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్న కమ్మిన్స్ అడిలైడ్.

కొవిడ్ సోకిన వారితో సన్నిహితం గా ఉండటంతో ఈ మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు.దీంతో కెప్టెన్సీ బాధ్యతలను స్టీవ్ స్మిత్ నెత్తినేసుకున్నాడు.ఇక మరి ఈ మ్యాచ్ లో ఇంకెన్ని అద్భుతాలు జరగబోతున్నాయో చూడాలి మరి గెలుపు కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube