ఏడాదిలోపు పిల్ల‌ల‌కు ఈ ఫుడ్స్ ఇవ్వ‌కూడ‌ద‌ట‌..తెలుసా?

సాధార‌ణంగా మొద‌టి సారి త‌ల్లైన మ‌హిళ‌లు త‌మ పిల్ల‌ల డైట్ విష‌యంలో తెగ మ‌ద‌న ప‌డి పోతూ ఉంటారు.పిల్ల‌ల‌కు ఎలాంటి ఆహారాలు పెట్టాలి.? ఎలాంటి ఆహారాలు పెట్ట‌కూడ‌దు.? వంటి ప్ర‌శ్న‌లు ఎంతో ఖంగారు పెడుతుంటాయి.అయితే ఇప్పుడిప్పుడే పాలు మానేసి ఉగ్గు, మెత్తటి పదార్థాలకు అలవాటు పడుతున్న ఏడాది లోపు పిల్లల డైట్ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను ఏడాదిలోపు పిల్ల‌ల‌కు త‌ప్ప‌ని స‌రిగా దూరంగా ఉంచాలి.

 These Foods Should Not Be Given To Children Under One Year Of Age! Children, 1 Y-TeluguStop.com

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ఏడాదిలోపు పిల్ల‌ల‌కు కొంద‌రు త‌ల్లులు తెలిసో, తెలియ‌కో పండ్ల ర‌సాల‌ను ప‌ట్టిస్తుంటారు.కానీ, పండ్ల ర‌సాల వ‌ల్ల పిల్ల‌లు ఒక్కోసారి డయేరియాకు గుర‌వుతుంటారు.అందుకే ఎట్టిప‌రిస్థితుల్లో వాళ్ల‌కు పండ్ల ర‌సాల‌ను ఇవ్వ‌రాదు.

అలాగే వేరుశెన‌గ‌లను సైతం ఏడాదిలోపు పిల్ల‌ల‌కు పెట్ట రాదు.ఎందు కంటే, వేరుశెన‌గ‌లు కొంత మంది పిల్లల్లో అలర్జీకి కారణం అవుతాయి.

కాబ‌ట్టి, పిల్ల‌ల డైట్‌లో వేరు శెన‌గ‌లు, వేరు వెన‌గ వెన్న వంటి వాటిని ఉండ‌కుండా చూసుకోవాలి.

ఏడాదిలోపు పిల్ల‌ల‌కు పొర‌పాటున కూడా చాక్లెట్స్‌ను ఇవ్వ‌రాదు.చాక్లెట్స్‌లో ఉండే కెఫిన్ పిల్ల‌ల ఆరోగ్యాన్ని మ‌రియు ఎదుగుద‌ల‌ను దెబ్బ తీస్తుంది.

ఖ‌ర్జూరాలు, వాల్ న‌ట్స్‌, జీడి ప‌ప్పు, పిస్తా ప‌ప్పు, బాదం ప‌ప్పు వంటి వాటిని కొంద‌రు త‌ల్లులు ఏదో ఒక రూపంలో పిల్ల‌ల‌కు పెడుతుంటారు.

కానీ, ఏడాది లోపు పిల్ల‌ల‌కు ఇటువంటి డ్రై ఫ్రూట్స్‌ను ఇస్తే అల‌ర్జీలు త‌లెత్తుతాయి.

ఇక ఏడాదిలోపు పిల్ల‌ల‌కు సోయాపాలు, సోయా ఉత్ప‌త్తులు, తేనె, స్వీట్స్‌, పంచ‌దార‌, దుంప జాతి కూర‌గాయ‌లను కూడా పెట్ట‌కూడ‌దు.

ఎందు కంటే, ఇవి పిల్ల‌ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును దెబ్బ తీసి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తేలా చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube