బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఏ కంటెస్టెంట్ విన్నర్ అవుతారనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాప్ 5లో కచ్చితంగా ఉండాల్సిన కంటెస్టెంట్లలో ఒకరైన రవి గత వారం ఎలిమినేట్ కావడంతో టైటిల్ రేస్ లో షణ్ముఖ్, సన్నీ, శ్రీరామచంద్ర నిలిచారు.
సిరి, కాజల్, మానస్ లలో ఇద్దరు కంటెస్టెంట్లు టాప్ 5లో ఉన్నా వాళ్లిద్దరూ విన్నర్ లేదా రన్నర్ గా నిలిచే అవకాశాలు అయితే దాదాపుగా లేవు.
అయితే గత సీజన్ల కంటెస్టెంట్లు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల గురించి చెబుతూ ఆ కంటెస్టెంట్లు గెలవడానికి కృషి చేస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అయిన అఖిల్ సార్థక్ తాను శ్రీరామచంద్రకు సపోర్ట్ చేస్తానని తెలిపారు.
రవి కూడా శ్రీరామచంద్రకు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.
అఖిల్ సార్థక్ తన సపోర్ట్ ను శ్రీరామచంద్రకు ప్రకటించడంతో అఖిల్ ఫ్యాన్స్ కూడా శ్రీరామచంద్రకు ఓట్లు వేసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ప్రముఖ సింగర్లలో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్ మాత్రం సన్నీని సపోర్ట్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో షణ్ముఖ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.షణ్ముఖ్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.
బిగ్ బాస్ సీజన్ 5 స్టార్టింగ్ లో షణ్ముఖ్ గేమ్ సరిగ్గా ఆడటం లేదని విమర్శలు వచ్చినా షణ్ముఖ్ ఆ తర్వాత యాక్టివ్ కావడం ద్వారా ఆ విమర్శలకు చెక్ పెట్టారు.మరోవైపు బిగ్ బాస్ షో వీక్ డేస్ లో, వీకెండ్స్ లో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.