కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే మాస్క్ ఒక్కటే మార్గం అని, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ ను ధరించవలెనని ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు జారీ చేసారు.
కానీ కొంతమంది మాత్రం మాస్క్ ధరించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వాలు మాస్క్ లేనిచో ఫైన్ వేస్తామని ప్రకటించింది.కరోనా మొదలైనప్పటినుంచి ఈ నాటికి అంటే అక్టోబర్ -24, 2021నాటికి బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు ధరించని వ్యక్తుల నుంచి రూ.77,37,41, 000 జరిమానా వసూలు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వ్యక్తులకు రూ.200 జరిమానా విధిస్తామని గతంలోనే ముంబై పోలీసులు ప్రకటనలు చేసారు.అయినాగానీ కొంతమంది మాస్క్ ధరించలేదు.కాగా ముంబైలో ఆదివారం 1316 కేసుల నుండి మొత్తం 2,63,200 రూపాయలు దాక సేకరించారు. BMC నివేదిక ప్రకారం కరోనా వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు అంటే గడిచిన 572 రోజుల్లో వసూలు చేసిన జరిమానాలు రూ.77 కోట్లు దాటినట్లు కార్పొరేషన్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా BMC గత వారం కరోనా వైరస్ ఆంక్షలను సడలించింది.అంటే ఇకమీదట సినిమా హాళ్లు, ఆడిటోరియంలను తిరిగి తెరవడానికి అనుమతించింది.అయినా గానీ ప్రతి ఒక్కరు కూడా యధావిధిగా ఫేస్ మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపింది.అలాగే మహారాష్ట్రలో కరోనా కేసుల విషయానికి వస్తే ఆదివారం రోజున 1,410 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు,18 మరణాలు నమోదయ్యాయి.
ఇంకా ముంబైలో ఆదివారం 408 కొత్త కోవిడ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి.