వామ పక్షాలు ఇక సొంత ఎజెండాతో పోరాటం చేయలేవా?

దేశ రాజకీయాలలో వామ పక్ష పార్టీలకు ప్రత్యేక స్థానం ఉంది.ఎంతో మంది ప్రజల సమస్యలపై పోరాటం చేసి అమరులైన వామపక్ష నాయకులు వామ పక్ష పార్టీల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ఉన్నారు.

 Cant The Left Parties Fight With Their Own Agenda Anymore, Left Parties, Telanga-TeluguStop.com

అయితే వామపక్ష సిద్దాంతాలు ఒకప్పటి రాజకీయాలకు చక్కగా సరితూగేవి.కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు వామ పక్ష సిద్దాంతాలకు సరితూగవు సరికదా ఆ సిద్దాంతాలకు కాలం చెల్లిన పరిస్థితి ఉంది.

అయితే వామ పక్ష నాయకులు కొంత మంది ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నా మెజారిటీ నాయకులు మాత్రం ఈ వాస్తవాన్ని అంగీకరించక పోవడం వల్ల వామ పక్ష పార్టీలు ప్రజల మద్దతు పొందడంలో వెనుకబడి ఉన్న పరిస్థితి ఉంది.అంతేకాక ప్రస్తుత ఖరీదైన రాజకీయాలలో  వామ పక్ష నాయకులు ఇమడలేరు.

ఎందుకంటే వామ పక్ష నాయకులు సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తారు.సంపాదన కంటే పోరాటాలు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మాత్రమే నిమగ్నమయి ఉంటారు.

ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో వెనకబడడమే కాక ఒక రాజకీయ పార్టీగా సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళడం లేదు.పోరాటాలు చేస్తున్న పరిస్థితి మాత్రం అంతగా కనిపించడం లేదు.

ప్రతీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మద్దతివ్వవడం, ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో వామపక్ష కార్యకర్తలు కూడా పోరాట పటిమను మెల్ల మెల్లగా కోల్పోతున్న పరిస్థితి ఉంది.

Telugu Communist, Cpi Cpm, Revanth Reddy-Political

ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో నిలదొక్కుకోవాలంటే సొంత ఎజెండాతో ముందుకెళ్తేనే నిలదొక్కుకునే అవకాశం ఉంది.లేకపోతే వేరే ఇతర పార్టీ ఎజెండాకు మద్దతిచ్చుకుంటే వెళ్తే ప్రజలు వామ పక్ష పార్టీలు అంటూ ఒకటున్నాయనే విషయం మరిచిపోయే అవకాశం  ఉంది.ముఖ్యంగా తెలంగాణలో వామ పక్షాలు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది.

మరి రానున్న రోజుల్లో వామ పక్షాలు సొంత ఎజెండాతో ముందుకెళ్తాయా వెల్లవా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube