ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల గురించి, ఎన్నికల ఫలితాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రకాష్ రాజ్ ఒక ప్యానల్, విష్ణు ఒక ప్యానల్ అని ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.
అయితే దాసరి నారాయణరావు లేని లోటు క్లియర్ గా కనిపిస్తుందని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.
దాసరి నారాయణరావు ఎన్నికలను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేశారని నట్టికుమార్ పేర్కొన్నారు.
ఈగోస్ వల్ల గొడవలు జరుగుతున్నాయని నట్టికుమార్ తెలిపారు.అసోసియేషన్ లో మెంబర్ గా ఎవరైనా ఉండవచ్చని అయితే తెలుగు వ్యక్తి ప్రెసిడెంట్ పదవికి ఉంటే బాగుంటుందని అయితే అది నిబంధన కాదని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.
ఏ భాషలో అయినా భాషాభిమానం ఉంటుందని అయితే తెలుగువాళ్లు అందరినీ అభిమానిస్తారని నట్టికుమార్ అన్నారు.
ప్రకాష్ రాజ్ ఇండియాలో నంబర్ వన్ ఆర్టిస్ట్ అని అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేవకు సంబంధించిన అసోసియేషన్ కాబట్టి విష్ణు చేస్తే బాగుంటుందని నట్టికుమార్ పేర్కొన్నారు.పెద్దలను ప్రకాష్ రాజ్ ఏకవచనంతో సంభోదించడం నచ్చలేదని నట్టికుమార్ అన్నారు.మాటామాట పెరిగి గొడవ పెద్దదవుతుందని నట్టికుమార్ తెలిపారు.
బెంగళూరు నుంచి ప్రకాష్ రాజ్ రాజకీయాలకు సంబంధించిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారని నట్టికుమార్ ప్రశ్నించారు.
చిరంజీవి గారు ప్రకాష్ కురాజ్ కు సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడా వెల్లడించలేదని చిరంజీవికి అందరు ఆర్టిస్టులు ముఖ్యమేనని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.చిరంజీవి అందరివాడని అందరి కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందని నట్టికుమార్ పేర్కొన్నారు.చిరంజీవి ఒక్కరి వైపు మాత్రమే ఉండే వ్యక్తి అని తాను అనుకోవడం లేదని నట్టికుమార్ పేర్కొన్నారు.
మరోవైపు ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని విష్ణు ఆహ్వానించారా లేదా అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.