బద్వేల్ బీజేపీ అభ్యర్థిగా సురేష్ !

టిడిపి, జనసేన పార్టీలు బద్వేల్ నియోజకవర్గం జరగబోతున్న ఉప ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటాము అంటూ ప్రకటించాయి.ముందుగా టిడిపి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను ప్రకటించినా, ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టినా,  చివరి నిమిషంలో టిడిపి వెనక్కి తగ్గింది.

 Bjp Badvel Mla Candidate Is Suresh Bjp, Janasena, Ysrcp, Ap, Congress, Badvel El-TeluguStop.com

వైసిపి అభ్యర్థిగా దివంగత వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధ ను ప్రకటించారు.కాంగ్రెస్ అభ్యర్థిగా కమలమ్మ ను పోటీకి దింపడం, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత ఇప్పటివరకు నెలకొంది.

ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా,  జనసేన విషయంలో వెనక్కి తగ్గడంతో పాటు, వైసీపీ కి మద్దతు ప్రకటించారు.ఎమ్మెల్యేగా ఉన్న వెంకటసుబ్బయ్య ఆకస్మికంగా మరణించడంతో, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఇది ఆనవాయితీగా వస్తోందని అందుకే తాము పోటీ చేయడం లేదంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

దీంతో బీజేపీ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని అంతా  అభిప్రాయపడినా, ఇక్కడ  పోటీనే బీజేపీ నేతలు కోరుకున్నారు.

ఈ క్రమంలో రకరకాల పేర్లు పరిశీలనకు వచ్చినా,  చివరకు ఏ బి వి పి , బీజేవైఎం లో కీలక పాత్ర పోషిస్తున్న కడప జిల్లా రైల్వే కోడూరు కు చెందిన సురేష్ పేరును బీజేపీ అధిష్టానం పైనల్ చేసింది.

  రాజకీయాలను తాము రాజకీయంగానే చూస్తామని , సెంటిమెంట్ కు ఇక్కడ తావు లేదని,  అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బిజెపి ప్రకటించింది.మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావడంతో , ఇక పోటీ రసవత్తరం గా ఉండే అవకాశం కనిపిస్తోంది.

వైసిపి ఇక్కడ మెజారిటీ పైనే లెక్కలు వేసుకుంటోంది.దాసరి సుధ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అని,  లక్షకు పైగా మెజార్టీ సాధించడమే లక్ష్యం అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ నియోజకవర్గం బాధ్యతలను జగన్ అప్పగించారు.ఇదిలా ఉంటే బిజెపి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో,  జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందా లేక వైసీపీ వైపు నిలబడుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Badvel, Congress, Dasari Sudha, Janasena, Mlavenkata, Puntha Suresh, Ysrc

 ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తీసుకువచ్చే విధంగా  ఒప్పిస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.ఈ ప్రకటనపై జనసేన నుంచి ఎటువంటి రియాక్షన్ కనిపించలేదు.కాకపోతే పవన్ ఈ ఎన్నికల ప్రచారానికి కాకుండా,  మద్దతు విషయంలోనూ సైలెంట్ గా ఉండే అవకాశమే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube