మెగాస్టార్ చిరంజీవిపై మంచు విష్ణు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.మా ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్ వెనుక ఓ రహస్య శక్తి ఉందన్నాడు.
ఆయన మరెవరో కాదు చిరంజీవి అని వెల్లడించాడు.మెగాస్టార్ చిరంజీవి ఏంటో? ఆయన ఫ్యామిలీ ఏంటో తనకు బాగా తెలుసన్నాడు.వేరే రాష్ట్రంలో ఫార్మ హౌస్ లో ఉండి వీడియోలు రిలీజ్ చేస్తున్న ప్రకాష్ రాజ్ ను చూసి మేము నోరు మూసుకుని ఉండాలా? అని ప్రశ్నించాడు.
ఇండస్ట్రీలో తన తండ్రి మోహన్ బాబు కంటే పెద్ద శక్తి ఎవరూ లేరని చెప్పాడు.
తన తండ్రే తనకు దేవుడన్నాడు.ఆయన సపోర్టు ఉన్నంత వరకు తనకు ఎదురులేదన్నాడు.
తనకు నచ్చినా.తన తండ్రికి నచ్చకపోతే ఆ పనిని మానుకుంటానని చెప్పాడు.
ప్రకాష్ రాజ్ కు పొలిటికల్ యాంబీషన్స్ ఉండొచ్చని తమకు మాత్రం అది లేదని వెల్లడించాడు.పొలిటికల్ యాంబినేషన్ తనకు ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి వెళ్లేవాడినని చెప్పాడు.
ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికలు చిరంజీవి, మోహన్ బాబుకా లేదా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుకా అనే ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు.మోహన్ బాబు, చిరంజీవి మంచి మిత్రులని చెప్పాడు.
అటు ప్రకాష్ రాజ్ మీద అనేక విమర్శలు ఉన్నాయని విష్ణు వెల్లడించాడు.ఆ విమర్శలు లేకుంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చన్నాడు.అయితే ఆయన ఏకగ్రీవానికి ఏ ఒక్క నిర్మాత, దర్శకుడు, అసిస్టెంట్ దర్శక్డు కూడా ఒప్పుకోడని వెల్లడించాడు.ప్రస్తుతం తన ముందు ఉన్న కర్తవ్యం మా ను ప్రక్షాలన చేయడం అన్నాడు.
అందులోని సమస్యలను క్లియర్ చేయాలన్నదే తన లక్ష్యమని వెల్లడించాడు.పొలిటికల్ ఎజెండాలతో మా ఎన్నికలకు రావొద్దని వెల్లడించాడు.
వేరే ఎజెండాలు ఉన్నవారు రాజకీయాల్లోకి వెళ్లాలే తప్ప ఇందులో ఉండకూడదని చెప్పాడు.మా ఎన్నికల్లో విజయం కోసం తనకు సపోర్టు చేయాలని కోరారు.
సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తానన్నాడు.