యాంకర్ హరితేజ ఇంటిని చూశారా.. ఇంద్రభవనాన్ని తలపించేలా?

తెలుగు రాష్ట్రాల మహిళలు సినిమాలు, రియాలిటీ షోలతో పోలిస్తే సీరియళ్లను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.తెలుగులో సీరియళ్ల ద్వారా ఫేమస్ అయిన నటీమణులలో హరితేజ కూడా ఒకరు.

 Hariteja Home Tour Video Goes Viral In Social Media,hariteja, Actress Hariteja H-TeluguStop.com

తాజాగా హరితేజ హోమ్ టూర్ కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.హరికథలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా హరితేజ తన ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

బిగ్ బాస్ షో సీజన్ 1లో పాల్గొన్న తర్వాత సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిన హరితేజ తన ఇంటిని ఇంటిలోని వస్తువులను అభిమానులకు చూపించారు.ఇంద్ర భవనాన్ని తలపించేలా హరితేజ ఇల్లు ఉండగా హరితేజ షేర్ చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వస్తున్నాయి.

ఎంట్రన్స్ , కిచెన్, బెడ్ రూమ్ లతో పాటు తన ఇంటికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.ఇంటికి సంబంధించిన వస్తువులను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నానని హరితేజ అన్నారు.

కాలింగ్ బెల్ సౌండ్ వల్ల పాప నిద్ర లేస్తుందని హరితేజ తెలిపారు.తన భర్తకు ఒకేచోట ఎక్కువ వస్తువులు ఉండటం నచ్చవని హరితేజ వెల్లడించారు.అభిమానులు తనకు ఇచ్చిన అవార్డులను సైతం హరితేజ చూపించారు.బిగ్ బాస్ షోలో తారక్ ఇచ్చిన అవార్డును హరితేజ చూపించారు.ఇంటికి వచ్చిన వాళ్లు బుద్ధుని బొమ్మలను ఎక్కువగా బహుమతులుగా ఇస్తున్నారని హరితేజ చెప్పుకొచ్చారు.

తన ఇంట్లో ఒక్కటే గడియారం ఉందని మా ఆయనకు చాదస్తం ఎక్కువని హరితేజ తెలిపారు.

షూటింగ్ నుంచి వచ్చిన సమయంలో అలసిపోతే లెగ్ మసాజర్ తో మసాజ్ చేసుకుంటానని హరితేజ పేర్కొన్నారు.అన్ని గదుల్లోనూ ఉయ్యాలను ఉంచామని హరితేజ వెల్లడించారు.హరితేజ సినిమాలు, సీరియళ్ల ద్వారా సంపాదించుకున్న డబ్బుతో ఈ ఇంటిని నిర్మించుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube