ఈరోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో ఫిల్మ్ నగర్ నందు ” ఆటో రజిని “ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.ఆన్ లైన్ బుకింగ్ విధానం విషయంలో.
పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.ఆన్ లైన్ బుకింగ్ విధానం విషయంలో ఏదో నలుగురు ప్రొడ్యూసర్ లను నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదని… ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచితే చూస్తూ.
ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు.
ఆన్ లైన్ బుకింగ్ వల్ల అందరికీ మేలు జరుగుతుంది అన్న భావనతో నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కొంతమంది లాభం పొందడానికే అన్నట్టుగా తమ ప్రభుత్వం వ్యవహరించాదని.చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ఆడాలని అందరికీ న్యాయం జరగాలని కొడాలి నాని పేర్కొన్నారు.
ఆన్ లైన్ బుకింగ్ ఈ విషయంలో పవన్ ఎదో మాట్లాడితే బెదిరిపోయే వారు వైసీపీ లో ఎవరూ లేరని.పవన్ ఉడుత ఊపులకు.ముఖ్యమంత్రి జగన్ చిటికెన వేలిపై వెంట్రుక కూడా పీకలేరు.అంటూ పవన్ కి గట్టిగా కొడాలి నాని తనదైన శైలిలో కౌంటరు ఇచ్చారు.