సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా కామన్.ఒక సినిమా విజయవంతం అయితే.
అదే సినిమాకు కొనసాగింపుగా మరో సినిమాను తీయడం చాలా కాలంగా ఆయా సినిమా పరిశ్రమల్లో కొనసాగుతూనే ఉంది.తెలుగుతో పాటు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఈ పద్దతి కొనసాగుతుంది.
అయితే ఇలా కాకుండా ముందుగా అనుకునే రెండు పార్టులుగా సినిమాలు తీయడం కొత్త ట్రెండ్ గా మొదలయ్యింది.తొలి పార్ట్ లో కొంత భాగం సినిమాను చూపించి.
మిగతా భాగం మరో సినిమాగా రూపొందిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.దానికి కారణం లేకపోలేదు.
వాస్తవానికి ఓ సినిమా డ్యూరేషన్ గతంలో మూడు గంటలు ఉండేది.ప్రస్తుతం దానిని రెండున్నర గంటలకు కుదించారు.
కానీ కొన్ని సినిమా కథలను రెండున్నర గంటల్లో చెప్పలేని విధంగా ఉంటాయి.అందుకే ముందుగా ప్లాన్ చేసి.
రెండు లేదా మూడు భాగాలుగా సినిమాలను విడుదల చేస్తున్నారు.
తెలుగులో ఇలా వచ్చిన సినిమా బాహుబలి.
ఈ సినిమాను ముందుగానే రెండు భాగాలుగా అనుకున్నాడు దర్శకుడు రాజమౌళి.అనుకున్నట్లుగానే బాహుబలిని 1, 2 పార్టులుగా విడుదల చేశారు.
ఈ రెండు భాగాలు కూడా కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకున్నాయి.అటు కన్నడలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా కూడా రెండు పార్టులుగా విడుదల చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ రెడీ అయ్యారు.
ఇప్పటికే కేజీఎఫ్ చాఫ్టర్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.అటు తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అటు తమిళంలో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాను తీస్తున్నాడు.దీన్ని కూడా రెండు పార్టులుగా విడుదల చేయాలని ఆయనభావిస్తున్నాడు.అటు కమల్ నటిస్తున్నతాజా సినిమా విక్రమ్ కూడా రెండు పార్టులుగానే విడుదల కాబోతుంది.అయితే రెండు పార్టులుగా సినిమా విడుదల కావడం పట్ల మంచి స్పందన వస్తుంది.
చెప్పాల్సిన కథను క్లియర్ గా చెప్పడంతో పాటు ఇండస్ట్రీలో పనిచేసే వారికి పనికూడా దొరుకుంతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.