వివాదాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శ్రీరెడ్డి కొంతకాలం సైలెంట్ అయినా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు.సమంత చైతన్యల బంధం గురించి తాజాగా మాట్లాడిన శ్రీరెడ్డి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు గెలుస్తాడని మంచు విష్ణుకు తాను సపోర్ట్ చేస్తున్నానని శ్రీరెడ్డి వెల్లడించారు.మంచు విష్ణు ఒక అధ్యాయాన్ని తిరగరాస్తాడని తాను నమ్ముతున్నానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రతిసారి నాగబాబు వచ్చి ఫలానా వాళ్లకు ఓటు వేయాలంటూ బ్లాక్ మెయిలింగ్ లాగా సభ పెట్టడం ఆ తర్వాత మెగా కాంపౌండ్ చెప్పిన వాళ్లకే ఓటు వేయడం జరిగిందని శ్రీరెడ్డి అన్నారు.మంచు విష్ణు ఓటు వేయడానికి ముందుకు రావడం శుభ పరిణామమని మంచు విష్ణు గెలిస్తే చిరంజీవి ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో చేసే రాజకీయాలకు స్వస్తి పలికినట్టే అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.
ఎవరి వాళ్లు స్వతంత్రంగా ఎదగడానికి అవకాశం వచ్చినట్టేనని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
సీఎం జగన్, కేసీఆర్ హయాంలో ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారని సినిమా ఇండస్ట్రీలో మనకంటూ స్వేచ్ఛ ఉండాలని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
ఇలా జరిగితే ప్రొడ్యూసర్లు బాగుంటారని అందరికీ న్యాయం జరుగుతుందని శ్రీరెడ్డి అభిప్రాయపడ్డారు.మంచి ప్రభుత్వాలు ఉంటే అందరికీ మేలు జరుగుతుందని శ్రీరెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువమంది ఓటుహక్కును వినియోగించుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఎన్నికల ఫలితాల తర్వాత మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ సంధించిన ప్రశ్నల గురించి క్లారిటీ ఇవ్వనున్నారు.మోహన్ బాబు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
మోహన్ బాబు పవన్ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.