రోజురోజుకూ టెక్నాలజీ యూసేజ్ బాగా పెరిగిపోతున్నది.ఈ క్రమంలో ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి లేకుండా కొన్ని పనులు అస్సలు జరగవు.
ఉదాహరణకు మెషిన్లు ఎంత పని చేసినా వాటిని మానవుడు మొదలు ఆన్ చేయాలి కదా.అలా సాంకేతికత ఎంత పెరిగినా మానవుడి ప్రమేయం లేకుండా పనులు జరగవు.ఈ క్రమంలోనే ఆటోలు, కార్లు, బైకులు ఇతర వాహనాలు రూపొందుతున్నాయి.అయితే, డ్రైవర్ లేకుండా ఆటో నడుస్తుందా? అని ఎవరిని ప్రశ్నించినా లేదనే సమాధానమే చెప్తారు.కానీ, ఒక చోట డ్రైవర్ లేకుండానే ఆటో నడుస్తుందండోయ్.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది.
ఇంతకీ ఆ ఆటో ఎక్కడ నడుస్తుందంటే.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురిలో ఈ ఘటన జరిగింది.
సదరు వీడియోలో ఆటో ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయి ముందుకు సాగుతుంది.అయితే, మొదలు ఆటో కింద పడిపోయి ఉండగా, దానిని డ్రైవర్ ఇతరుల సాయంతో లేపాడు.
అంతే.సదరు ఆటో ఆటోమేటిక్‌గా కదలడం స్టార్ట్ అయింది.
అప్పటికే ఆటో గేర్‌లో ఉంది, దాంతో ఆటో పడిపోయి రోడ్డు మీద స్టాండ్ కాగానే కదిలి ముందుకు వెళ్లింది.డ్రైవర్, ఇంకా ఇతరులు ఆటోను ఆపేందుకు ప్రయత్నించారు.
కానీ ఫలితం లేకుండా పోయింది.ఆటో కంట్రోల్ లేకుండానే కొద్ది దూరం రోడ్డుపై దూసుకుంటూ వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో స్థానికులు అప్రమత్తమై ఆటో ముందరకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
కొద్ది దూరం వెళ్లాక ఆటో ఓ షాపు వద్ద ఆగిపోయింది.స్థానికులు దీన్నంతిటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.దాంతో అది నెట్టింట వైరలవుతోంది.
అది చూసి అదేంటీ ఆటో డ్రైవర్ లేకుండా వెళ్తోందని కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, ఇటువంటి ఆటోను చూడటం ఇదే ఫ్రథమం అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు జరిగాయని, జాగ్రత్తగా ఉండాలని, తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పోస్టులు పెడుతున్నారు.