రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆ కామెంట్ల వల్ల పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.నిన్నటి నుంచి భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.170 కోట్ల రూపాయల ఆఫర్ వస్తే ఓటీటీకి ఇచ్చేందుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారని ప్రచారం జరిగింది.
అయితే భీమ్లా నాయక్ ఓటీటీలో రిలీజ్ కానుందంటూ జరుగుతున్న ప్రచారం గురించి మేకర్స్ స్పందించారు.ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని థియేటర్లలోనే భీమ్లా నాయక్ రిలీజ్ కానుందని స్పష్టతనిచ్చారు.
వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.భీమ్లా నాయక్ పై వచ్చే రూమర్లను నమ్మవద్దని నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ కు దర్శకత్వం వహిస్తుండగా ఈ దర్శకుడు అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
భీమ్లా నాయక్ సినిమాతో సాగర్ కె చంద్ర హిట్ సాధిస్తే మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం సాగర్ కె చంద్రకు వచ్చే ఛాన్స్ ఉంది.వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్ భీమ్లా నాయక్ తో ఆ సినిమను మించిన హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ఒకవైపు భీమ్లా నాయక్ లో నటిస్తూనే హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తూ రెండు సినిమాలను ఒకే సమయంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న పవన్ పాన్ ఇండియా సినిమాలలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.