తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నేడు ఎన్నో సినిమాలలో హీరోగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న నటులలో శర్వానంద్ ఒకరు.సంక్రాంతి, శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మి, రాజు మహారాజు వంటి చిత్రాలలో చిన్న పాత్రలో నటించి మెప్పించిన శర్వానంద్ ప్రస్తుతం హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు.
ఈయన హీరోగా నటించిన రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి వంటి చిత్రాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ తాజాగా మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నారు.
ఇందులో అను ఇమ్మానియేల్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ అను ఇమ్మానియేల్ దర్శకుడు అజయ్ భూపతి, శర్వానంద్ ఇతర చిత్ర బృందం హాజరు కాగా కొందరు ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ విడుదల చేసిన అనంతరం శర్వానంద్ ఈ సినిమా గురించి ముచ్చటించారు.ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ఓ అభిమాని శర్వానంద్ తో సెల్ఫీ దిగాలని కోరగా అతనితో సెల్ఫీ దిగిన శర్వానంద్ అతడు మీ జాకెట్ బాగుంది నాకు ఇస్తారా.అని అడగడంతో ఆ అభిమాని అడిగిన వెంటనే శర్వానంద్ తన జాకెట్ తీసి తన అభిమానికి కానుకగా ఇచ్చారు.ఇలా అభిమాని పట్ల శర్వానంద్ చూపించిన ప్రేమ మరికొందరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీ విడుదల కానుందని ప్రతి ఒక్క ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.ఇక శర్వానంద్ ఈ సినిమాతో పాటు “ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.