టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రెసెంట్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ అదే జోష్ లో ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న విషయం తెలిసిందే అందుకే ఈ సినిమాపై అటు పూరీ ఇటు విజయ్ ఇద్దరు కూడా ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.
ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం తరచూ విజయ్ ముంబై వెళుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో విజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ముంబై చాలా వేగవంతమైన సిటీ అని అక్కడ ప్రజలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారని అన్ని సమయాల్లో వేకువగానే ఉంటూ ప్రతిదీ వేగంగా చేసుకుంటూ వెళ్తారని అయన తెలిపారు.కానీ నేను మాత్రం లేజీ ఉన్నవాడిని కానీ నా వేగం నాదే.నేను స్వంత వేగంతో పనిచేసే హైదరాబాదీని అని విజయ్ చెప్పారు.నాకు ముంబై ఇష్టమైన సిటీ అయినప్పటికీ ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే సందర్శిస్తానని కానీ నేను హైదరాబాద్ లోనే నివసిస్తా అని చెప్పాడు.
హైదరాబాద్ లో ఉన్న వారు చాల ప్రొఫెషనల్ గా ఉంటామని మన పని కోసం శ్రమను అంత దారపోస్తామని.అలానే హైదరాబాద్ చాలా నిర్దిష్ట వేగంతో మాత్రమే పనిచేస్తుందని ఆయన తెలిపాడు.అంతేకాదు నేను నా కెరీర్ మూలలను మాత్రం ఎప్పటికి మర్చిపోనని చెప్పారు.ముంబైలో పార్టీల్లో తిరుగుతూ విజయ్ మారిపోయాడని అనుకున్న వారికీ విజయ్ ఏమాత్రం తాను మారలేదని చెప్పకనే చెప్పాడు.