బ్రేకింగ్.. బిగ్ బాస్ విన్నర్ సిద్దార్ద్ శుక్లా కన్నుమూత!

హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్ల గుండెపోటుతో మరణించారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ్ బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

 Big Boss Winner And Famous Tv Celeb Siddharth Shukla Passed Away Bigg Boss, Sid-TeluguStop.com

అయితే గురువారం తీవ్రమైన గుండెపోటు రావడంతో సిద్ధార్థ్ కన్నుమూసినట్లు తెలుస్తోంది.ఉన్నఫలంగా ఈయన మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదంగా మిగిలిపోయింది.

ఆయన మరణవార్త తెలియగానే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.కేవలం నలభై సంవత్సరాల వయసు కలిగిన సిద్ధార్థ శుక్ల చివరిగా  బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3 లో అగస్త్య పాత్రలో కనిపించి సందడి చేశారు.

సిద్ధార్థ్ హిందీలో బాలికా వధూ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విపరీతమైన తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నారు.

Telugu Bigg Boss, Bollywood-Movie

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా నిలిచిన సిద్ధార్థ్ మరింత పాపులారిటీని దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే వరుస అవకాశాలు అందుతున్న క్రమంలో ఈ విధంగా సిద్ధార్థ మృతి చెందడం బాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఇతని మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube