శ్రీవారి భక్తులకు కొత్తగా 'ధన ప్రసాదం'..!

తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.భక్తుల సౌకర్యార్థం మరో వినూత్న ఆలోచననకు తెరలేపింది.

 Ttd, Tirumla, Dana Prasadam, Latest News, Viral News, Devotes, Prasadam,latest N-TeluguStop.com

తిరుమల శ్రీవారి భక్తుల కోసం శ్రీవారి ధన ప్రసాదంను అందుబాటులోకి తెచ్చింది.టీటీడీ ధనప్రసాదం పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లను ఇవ్వనుంది.

వీటితో పాటుగా పసుపు, కుంకుమ కలిపి ఇవ్వనుంది.భక్తులకు పసుపు, కుంకుమ, చిల్లరనాణేలు కలిపిన ప్యాకెట్ ను ధనప్రసాదంగా అందజేస్తోంది.

శ్రీవారికి ప్రతిరోజూ కూడా హుండీ ఆదాయంలో 10 నుంచి 20 లక్షల రూపాయల వరకూ చిల్లరను భక్తులు కానుకగా సమర్పిస్తారు.అదేవిధంగా చిల్లరతో పిల్లలను తూకాలు వేస్తుంటారు.

ఇంకొందరు నూట పదహారు, వెయ్యి నూట పదహారు రూపాయలను కానుకగా హుండీలో వేస్తుంటారు.వాటిని భక్తులకే ప్రసాదంగా ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి సిద్దమయ్యింది.

చిల్లర నాణేల నిల్వలు టీటీడీలో భారీగా ఉన్నాయి.వాటిని భక్తులకు ఇవ్వడానికి సిద్దమైంది.

చిల్లర నాణేలను నోట్ల కట్టల రూపంగా మార్చేందుకు శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమలలో సామాన్యులు బస చేసే అతిధి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో 100 రూపాయి నాణేలను ప్రత్యేక కవర్లలో భక్తులకు ఇవ్వనుంది.

Telugu Dana Prasadam, Devotes, Latest, Prasadam, Tirumla-Latest News - Telugu

ఇప్పుడు ఒక్క రూపాయి నాణేలను ధనప్రసాదంగా ఇస్తోంది.రాబోయే రోజుల్లో 2, 5 రూపాయల నాణేల ప్యాకెట్ లను కూడా టీటీడీ భక్తులకు ఇవ్వనుంది.శ్రీవారి భక్తులు బస చేయడానికి గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తోంది.

ఆ సమయంలో వారు రూమ్ ను ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్‌ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.ధన ప్రసాదాన్ని తిరుమల కొండపై కౌంటర్లలో కూడా ఇవ్వనున్నారు.

కవర్లో కాయిన్స్ తో పాటుగా పసుపు, కుంకుమ కలిపి ఇవ్వనున్నారు.కవర్ లోపల వంద రూపాయి కాయిన్స్ వరకూ ఉండనున్నాయి.

వంద రూపాయలు చెల్లించిన తర్వాతే ధనప్రసాదాన్ని తీసుకునేందుకు వీలుంటుంది.లడ్డు ప్రసాదం కొనుక్కునే విధంగానే నాణేలను ప్రసాదంలాగా తీసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube