వైరల్: ఇదెక్కడి ఎద్దుల పంచాయితీ... ఊకో కాకా.. కొట్లాట దేనికి?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియోని వైరల్ చేస్తుందో చెప్పలేము.కొన్నిసార్లు డ్యాన్స్ వీడియోలు జనాల్ని మెప్పిస్తే, మరి కొన్నిసార్లు జంతువుల వీడియోలు జనాలకు బాగా నచ్చుతాయి.

 Dog Stops Two Buffaloes Fighting On The Street Video Viral Details, Buffalo, Jud-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే కుక్కల వీడియోలు, ఆవుల వీడియోలు, ఎద్దుల వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంటాయి.కుక్కలు( Dogs ) ఇతర జంతువులతో స్నేహం చేసే వీడియోలు, జాతి వైరం మర్చిపోయి ఇతర జంతువు పిల్లలకు పాలు పడుతున్న వీడియోలు మనం అనేకసార్లు ఇంటర్‌నెట్‌లో చూశాం.

ఈ క్రమంలోనే వీధి కుక్కల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతూ ఉంటాయి.కుక్కల కారణంగా చిన్నారులు సహా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు మరి.

అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే… ఇక్కడ ఒక వీధి కుక్క( Stray Dog ) చేసిన పని మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.అవును, ఇక్కడ వైరల్ వీడియోని గమనిస్తే… రెండు ఎద్దులు బాగా కుమ్మేసుకుంటుంటే.ఒక కుక్క ఏం చేసిందో తెలుసుకోవాలంటే మీరు ఈ కంటెంట్ మొత్తం చదవాల్సిందే… వైరల్‌ వీడియోలో రెండు ఎద్దులు( Two Buffaloes ) నడిరోడ్డుపై పోట్లాడుకోవడం స్టార్ట్ చేసాయి.వీడియోని గమనిస్తే రెండు ఎద్దులు ఒకదానితో ఒకటి పోటాపోటీగా పోట్లాడుకోవడం చాలా స్పష్టంగా చూడవచ్చు.

ఈ సమయంలో అక్కడికి ఓ కుక్క వచ్చి రెండు ఎద్దుల యుద్దాన్ని ఆపేందుకు ప్రయత్నించడం ఇక్కడ చాలా ఫన్నీగా అనిపిస్తోంది.

అయితే ఆ కుక్క ఎంత అరిచినా ఆ రెండు ఎద్దులు ఆగలేదు.దాంతో ఈసారి కుక్క కూడా వెనక్కి తగ్గకుండా మళ్లీ వాటి మధ్యలోకి దూరింది.కడకు కుక్క ప్రయత్నాలు ఫలించాయి.

ఆ రెండు ఎద్దులు ఫైటింగ్( Buffaloes Fight ) చేసుకోవడం ఆపేశాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాంతో ఈ వీడియోకు ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వీక్షణలు లభించాయి అంటే సాధారణమైన విషయం కాదు.అలాగే, చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందిస్తున్నారు కూడా.

ఒక యూజర్‌ స్పందిస్తూ.ఈ కుక్కకు అవార్డు అవ్వొచ్చు… అని కామెంట్‌లో రాశాడు.

మరొక వినియోగదారు ఇంత తెలివైన కుక్క ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube