సహాయం చేసిన విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతునన్ ట్రాన్స్ జెండర్ కంటతడి వీడియో!

సినిమా పరిశ్రమలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో రాణిస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.మరికొందరు హీరోలు గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.

 Transgenders Thanks Vijay Devarakonda Help Details, Transgenders, Vijay Devarako-TeluguStop.com

కొందరు హీరోలు చేసే పనులు బయటికి కనిపిస్తే మరి కొందరు మాత్రం ఇతరులకు తెలిసి తెలియకుండా ఎంతోమందికి సహాయం చేస్తూ వారి గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు.అలాంటి పనులు కేవలం కొన్ని కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి.

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కూడా అలాంటి పనే చేశారు.

తన ఫౌండేషన్‌ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన విజయ్‌ ఎప్పుడూ తను చేసిన సాయాన్ని చెప్పుకోలేదు.

అయితే తాజాగా ఆహా( Aha ) తెలుగు ఓటీటీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ 3లో( Indian Idol 3 ) విజయ్‌ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు తాము విజయ్‌ నుంచి సాయం పొందినట్లు తెలుపుతూ ఎమోషనల్‌ అయ్యారు.

విజయ్‌ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు.ముఖ్యంగా లాక్‌డౌన్‌లో తన ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మందికి సాయం చేశారు.

పేదలకు నిత్యవసర సరకులను అందజేశారు.గత ఏడాదిలో ఖుషి సినిమా సమయంలో కూడా 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ.కోటి రూపాయలు అందచేసి తన మంచి మనసును చాటుకున్నారు.

ఇండియన్ ఐడల్ 3లో గెస్ట్‌గా విజయ్‌ దేవరకొండ వెళ్లారు.ఆయన గొప్ప మనసు గురించి చెబుతూ ఒక ట్రాన్స్‌జెండర్‌( Transgender ) కన్నీళ్లు పెట్టుకున్నారు.నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సర్‌.

మీకు థ్యాంక్స్‌ చెప్పాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను.మేము భిక్షాటనతోనే జీవిస్తాం.

కానీ, కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ వల్ల మేము ఇంటికే పరిమితం అయ్యాము.అప్పుడు మాకు మూడు పూటల తినేందుకు ఆహారం కూడా లేదు.

అలాంటి సమయంలో సోషల్‌ మీడియా ద్వారా విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌( Vijay Devarakonda Foundation ) గురించి తెలుసుకుని నాకు సాయం చేయాలని ధరఖాస్తు చేసుకున్నాను.కొన్ని నిమిషాల్లోనే నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.

ఆ సమయంలో నాతో పాటు మరో 18 మంది ట్రాన్స్‌ జెండర్స్‌ కు మీరు సాయం చేశారు.

ఆ తర్వాత నా కుటుంబానికి కూడా సాయం అందించారు.అప్పుడు నాకు అనిపించిన మాట కనిపించని దేవుడు ఎక్కడో లేడు మీలోనే ఉన్నాడని అనిపించింది అంటూ ఆ ట్రాన్స్‌ జెండర్ ఫుల్ ఎమోషనల్ అయింది.ఆ సమయంలో విజయ్‌ కూడా రియాక్ట్‌ అయ్యారు.

అది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు.ఎంతో మంది రూ.500, రూ.1000 తమకు తోచిన వరకు ఇచ్చారు.అలా వారందరి వల్లనే ఇది సాధ్యమైంని ఆయన అన్నారు.అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube