ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ ఇటీవలే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది.ఆ ప్రకటన చేసిన తర్వాత సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
తీరా చూస్తే సినిమా షూటింగ్ ను మళ్లీ కడపలో చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తమిళ నటుడు సత్యదేవ్ పై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.
ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ లో ఉన్నాడు.అయన లేని సన్నివేశాలు ప్రస్తుతం సత్యదేవ్ పై కడపలో చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ముగియలేదని.కొన్ని కీలక సన్నివేశాలు రీ షూట్ కు ప్లాన్ చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు రిలీజ్ విషయంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రచారం జరుగుతోంది.సినిమా ను సంక్రాంతికి అంటూ ప్రకటించారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ కు కాని విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ ఉన్నారు.సినిమా షూటింగ్ ముగియలేదు.
దానికి తోడు గ్రాఫిక్స్ వర్క్ కాస్త ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అందుకే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే అనేక సార్లు సినిమా షూటింగ్ అదుగో ఇదుగో అంటూ వాయిదా వేశారు.విడుదల విషయంలో కూడా స్పష్టత లేకుండా కంగారు పెట్టారు.అందుకే ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల విషయంలో గందరగోళం ఏర్పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రాధే శ్యామ్ నుండి ముందు ముందు మరెన్ని ట్విస్ట్ లు వినాల్సి వస్తుందో చూడాలి.