స్టార్ హీరోయిన్ నయనతార కొన్ని రోజుల క్రితం తనకు నిశ్చితార్థం జరిగిందని వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసిన సంగతి తెలిసిందే.తాజాగా నయనతార పెళ్లి గురించి స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.
తన పెళ్లి గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాను రహస్యంగా పెళ్లి చేసుకోనని నయనతార స్పష్టం చేశారు.గతంలో నయనతార తన పెళ్లి గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
తాజాగా ఒక తమిళ ఛానెల్ తో మాట్లాడిన నయనతార తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ అని చెప్పుకొచ్చారు.ఇకపై మీడియా కథనాల్లో కూడా ఇలాగే రాస్తారని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.
విఘ్నేష్ శివన్ ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ స్టేజ్ ను ఎప్పుడో దాటిపోయాడని నయనతార చెప్పుకొచ్చారు.పెళ్లి గురించి ఇప్పటివరకు సరైన నిర్ణయం తీసుకోకపోవడానికి వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉండటమే కారణమని నయనతార చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే ఆ వివరాలను అభిమానులకు చెబుతానని నయనతార అన్నారు.ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే తన నిశ్చితార్థం జరిగిందని నయనతార కామెంట్లు చేశారు.పెద్దగా సంబరాలు చేసుకుంటూ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని నయనతార చెప్పుకొచ్చారు.నయనతార తన పెళ్లి గురించి కామెంట్లు చేయడంతో త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని స్పష్టమవుతోంది.
తాజాగా నయనతార నటించిన నేట్రిగన్ మూవీ ఓటీటీలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.సినిమాను బట్టి నయనతార పారితోషికం తీసుకుంటున్నారు.అయితే సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ మాత్రం నయనతార అనే చెప్పాలి.ఒక్కో సినిమాకు నయనతార 5కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం.
తెలుగులో ఈ మధ్య కాలంలో నయనతార ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు.