అక్కడ సీఎం జగనన్నకు గుడి కట్టిస్తున్న ఎమ్మెల్యే..!?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాలు అంటూ అనే పధకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు బాగా చేరువ అయ్యారు.ఆయన పేదలకు చేస్తున్న మంచి పనులు అన్ని ఇన్నీ కావు.

 Srikalahasthi Mla Madhusudhan Reddy Builts Temple For Ap Cm Jagan, Ap Cm, Jagan,-TeluguStop.com

పిల్లలు చదువుకునేలాగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు.అలాగే రైతుల కష్టాన్ని గుర్తించి వారికి రైతు భరోసా అనే అభయాన్ని ఇచ్చారు.

సొంతింటి కలను ప్రతి వ్యక్తి నిజం చేసుకోవాలి అని భావించి పేదలందరికీ ఇల్లు అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అవ్వా తాతలకు ఫింక్షన్ ఇచ్చి ఇంటికి పెద్దకొడుకు అయ్యాడు.

ఆరోగ్యశ్రీ ని ప్రవేశపెట్టి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు.స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ అని, ఇంకా.

ఆసరా అని, కాపు నేస్తం, చేయిత అని అక్కా చెల్లెళ్లకు ఒక అన్నలాగా మారాడని.ఇంకా ఎన్నో చేసిన వైస్ జగన్ మోహన్ రెడ్డికి ఏకంగా ఒక ఎమ్మెల్యే గుడి కట్టించేసారు తెలుసా.

ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయనకు గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.సీఎం జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పేరుతో దేవాలయాన్ని నిర్మించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.

రైతు భరోసా, వైస్సార్ పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పేదలందరికి ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో భారీ స్థూపాలను నిర్మించారు శ్రీకాళహస్థి ఎమ్మెల్యే.

Telugu Ap Cm, Ap Cm Jagan, Builts Temple, Jagan, Navarathnalu, Statue, Temple, L

అలాగే ఈ భారీ స్థూపాలతో పాటు, జగన్ మోహన్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయించారు.ఈ గుడిని నిర్మించడానికి ఎమ్మెల్యే సుమారు రెండు కోట్ల దాక ఖర్చు చేశారట.దేశంలో ఎవ్వరు ప్రవేశపెట్టని పథకాలను మన ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేసారని, ఆయన పాలనలో ప్రజలు అందరు చాలా సంతోషంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేసారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube