ఈ పాపం బిడెన్ దే...జరగబోయేది ఇదే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి అధ్యక్షుడు బిడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు చేయని తప్పిదం బిడెన్ చేశారని, చరిత్ర హీనుడిగా బిడెన్ మిగిలిపోతారని ఆరోపించారు.

 Trump Blams To Biden Afghan Policy , Trump, Biden, Afghanistan, Biden Governmen-TeluguStop.com

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నా ఘోరాలకు బిడెన్ ముఖ్య కారకుడని, ఉన్నపళంగా బలగాలను వెనక్కి రప్పించడం వలెనే ఇప్పుడు తాలిబన్ల చెరలో ఆఫ్ఘన్ మగ్గుతోందని మండిపడ్డారు.బిడెన్ అధికార వైఫల్యానికి ప్రతీక ప్రస్తుత ఆఫ్హన్ పరిస్థితితని దుయ్యబట్టారు.

బిడెన్ నిర్ణయం తాలిబన్లకు వరంగా మారిందని అన్నారు ట్రంప్.

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ల చెర నుంచీ విముక్తి చేయడానికి మళ్ళీ ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి అమెరికా దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించిందని, ఎంతో మంది అమెరికా సైనికులు తమ ప్రాణాలు పళంగా పెట్టి ఆఫ్ఘనిస్తాన్ ను రక్షించారని, అమెరికా వారికోసం ఎంతో చేసిందని చివరి నిమిషంలో బిడెన్ వారిని వెనక్కి రప్పించడంతో పరిస్థితిలు మళ్ళీ తలక్రిందులు అయ్యాయని, ఇంత పెద్ద పాపం బిడెన్ మూటగట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్.

Telugu Afghanistan, Biden, Taliban, Trump, Trumpblams-Telugu NRI

బలగాలను వెనక్కి తీసుకుంటే ఏం జరుగుతుందో ముందే బిడెన్ ఊహించినా కావాలనే ఈ నిర్ణయం తీసుకుని ఈ భారీ విపత్తుకు కారణం అయ్యారని ఆరోపించారు ట్రంప్.అయితే ఈ విషయంపై బిడెన్ ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందిస్తోంది.ట్రంప్ అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే బలగాలను వెనక్కి తీసుకున్నామని, ఇక దాదాపు 3 లక్షల మంది ఆఫ్ఘన్ సైనికులకు శిక్షణ ఇచ్చామని, ఇన్నాళ్ళు ఆఫ్ఘన్ కు కాపాడామని ఇంతకు మించి ఏ దేశం ఎలాంటి సాయం చేస్తుందని, శిక్షణ తీసుకున్న సైనికులు తమ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రంప్ కు కౌంటర్ ఇస్తోంది.ఏది ఏమైనా బిడెన్ బలగాలు వెనక్కి తీసుకోవడం వలెనే ఆఫ్హన్ లో పరిస్థితి ఇలా మారిందని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ట్రంప్ వ్యూహాత్మకంగా విమర్శలు చేపట్టారని అంటున్నారు పరిశీలకులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube