తెలుగులో కమెడియన్ పాత్రలు చేయడం ద్వారా కమెడియన్ పృథ్వీ మంచి పేరు సంపాదించుకున్నారు.ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన పృథ్వీ ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అందిపుచ్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందనే చెప్పాలి.ఖడ్గం సినిమా తర్వాత పృథ్వీకి నటుడిగా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి.30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ డైలాగ్ తో పృథ్వీ పేరును సంపాదించుకున్నారు.
ఆ పాత్ర ఎవరినీ ఉద్దేశించి చేసిన పాత్ర కాదని పృథ్వీ వెల్లడించారు.జీవితంలో ఆ పాత్ర మెమరబుల్ పాత్ర అని పృథ్వీ పేర్కొన్నారు.లైఫ్ విషయంలో తాను ఏకాకినని తాను చావు దగ్గరికి వెళ్లి వచ్చానని పృథ్వీ వెల్లడించారు.తనకు ఆరోగ్యం బాగోలేని సమయంలో సపోర్ట్ ఇచ్చిన వాళ్లు లేరని పృథ్వీ వెల్లడించారు.
మగ, ఆడ మధ్య స్నేహం ఉందంటే ఆ రిలేషన్ ను తప్పుగా అనుకోవద్దని పృథ్వీ అన్నారు.
విన్నర్ సినిమాలో ఒక సీన్ లో భాగంగా నేలకొచ్చి తగిలానని ఆ సమయంలో ఆరు నెలలు రెస్ట్ తీసుకున్నానని పృథ్వీ తెలిపారు.
తనకు లౌక్యం సినిమాతో బ్రేక్ వచ్చిందని పృథ్వీ అన్నారు.ఖడ్గం నుంచి లౌక్యం మధ్యలో సరైన సక్సెస్ రాలేదని అప్పుడు 20,000 వచ్చేదని అయితే బంధువులు మాత్రం రోజుకు లక్ష ఇస్తారని భావించేవారని పృథ్వీ అన్నారు.
ఇప్పుడు రోజుకు లక్షే వచ్చినా జీఎస్టీ, టీడీఎస్, మేనేజర్ కమిషన్ అన్నీ ఉంటాయని పృథ్వీ చెప్పుకొచ్చారు.
జగమంతా కుటుంబం నాది అని నేను అనుకుంటానని పృథ్వీ తెలిపారు.రంగస్థలంలో క్యారెక్టర్ తీసేయడం గురించి పృథ్వీ చెబుతూ అమెరికాలో ఒకాయన చెబితే తన పాత్రను తీసేశారని తెలిపారు.మనం దర్శకుడిని ప్రశ్నించలేమని పృథ్వీ తెలిపారు.
రాజకీయాల వల్ల సినిమా ఆఫర్లు తగ్గుతాయనడంలో నిజం లేదని పృథ్వీ వెల్లడించారు.