సరే దిగుమతి సుంకం తగ్గిస్తాం.. ఇండియాలో వెంటనే మీ ప్లాన్ ఏంటీ, ఎలన్ మస్క్‌కు కేంద్రం ప్రశ్న

భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్‌కు ఇక్కడి దిగుమతి సుంకాలు ప్రతిబంధకంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది భారత్‌లో అమ్మకాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న టెస్లా.

అన్ని మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్‌కు లేఖలు రాసింది.పూర్తి అసెంబ్లీంగ్ జరిగిన కార్లపై 40 శాతం మేర పన్నులు తగ్గించాలని కోరింది.40 శాతం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు మరింత సరసమైన ధరకు రాగలవని మస్క్ అభిప్రాయపడుతున్నారు.కానీ ఈ లేఖలపై నీతి ఆయోగ్ కానీ, రవాణా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు స్పందించలేదు.

ఇలాంటి పరిస్ధితుల్లో విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పింది కేంద్రం.దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ సైతం స్పష్టతనిచ్చారు.

దిగుమతి సుంకాలను తగ్గించే ఉద్దేశం లేదని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారు.అయితే, స్థానికంగా ఉన్న విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు దేశంలో విధిస్తున్న పన్నులను తగ్గిస్తామని, చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

Advertisement

ఇదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిపై పన్నుల్లో ఎలాంటి తగ్గింపూ ఉండదని క్రిషన్ పాల్ తెలిపారు.ఈ ప్రకటనతో భారత్‌లో ఎలా ప్రవేశించాలా అన్న సంకట స్థితిలో వున్న టెస్లాను ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

మీరు కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే. భారత్‌లో తక్షణ కార్యాచరణ ఏంటో వివరించాలని ప్రభుత్వం కోరింది.

ఈ మేరకు గత నెల ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఓ ఉన్నతాధికారి జాతీయ మీడియాకు వెల్లడించారు.

పూర్తిగా అసెంబ్లీంగ్ జరిగిన కార్లను దిగుమతి చేసుకోవడం కంటే.విడి భాగాలను యూనిట్ల వారీగా దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేంద్రం.టెస్లాకు సూచించినట్లు సదరు అధికారి పేర్కొన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీనిపై తమ అభిప్రాయం తెలపాలని టెస్లాను కోరినట్లు తెలిపారు.అలాగే భారత్‌లోనే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని కూడా కోరినట్లు ఆయన చెప్పారు.

Advertisement

భారత్‌లో ఇప్పటి వరకు 100 మిలియన్‌ డాలర్లు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసినట్లు టెస్లా ప్రతినిధులు కేంద్రానికి వివరించారట.పన్నులు తగ్గిస్తే ఈ విలువ మరింత పెరుగుతుందని పేర్కొన్నారని ఆ అధికారి వెల్లడించారు.

అలాగే అమ్మకాలు, సేవలు, ఛార్జింగ్‌ వసతుల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడతామని టెస్లా ప్రతినిధులు కేంద్రానికి హామీ ఇచ్చారట.ఈ విధంగా భారత్‌లోకి దశలవారీగా ప్రవేశించి పూర్తి స్థాయి తయారీలో పెట్టుబడులు పెడతామని వారు చెప్పినట్లుగా ఆ అధికారి వెల్లడించారు.

కాగా, బెంగళూరులో తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.అన్నీ అనుకున్నట్లే జరిగితే అమెరికా తర్వాత టెస్లా పరిశోధనా కేంద్రం ఉన్న రెండో దేశం ఇండియానే అవుతుంది.మరోవైపు భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది.2025 నాటికి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.మొత్తం రూ.50 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 వేల కోట్లు..

వాహనాల విడి భాగాలైన బ్యాటరీ, కంట్రోలర్, మోటార్ల నుంచి రానుంది.వీటికి తోడు రాబోయే రోజుల్లో భారత్‌లో 30 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాల అంచనా.

తాజా వార్తలు