అకిరా ఇంకా చిన్నపిల్లాడు.. అలాంటి వాటిపై ఆసక్తి లేదు: రేణూ దేశాయ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్.ఈమధ్య ఇతడి పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

 Renu Desai About Akira Nandan Cine Entry Akira Nandan, Renu Desai , Tollywood ,-TeluguStop.com

ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం లేని అకిరాకు పవన్ అభిమానుల నుండి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.పవన్, రేణు విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఓ విషయంలో అకిరా చిన్న పిల్లవాడు అంటూ ఓ కామెంట్ చేసింది.

రేణుదేశాయ్ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, తన పిల్లల ఫోటోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా గతంలో అకిరా నందన్ ఫోటోలు పంచుకోగా పవన్ అభిమానులు మాత్రం తెగ లైక్స్ చేశారు.

పైగా ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నలు కూడా వేశారు.కానీ అతడికి సినిమాలంటే ఇష్టం లేదు అంటూ సమాధానమిచ్చింది.

Telugu Akira Nandan, Pawan Klayan, Renu Desai, Tollywood-Movie

ఈ మధ్య అకిరా కర్ర సాము చేసిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే.ఇక ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా చాలామంది అకిరా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడని.నటన కోసం శిక్షణ తీసుకోవడానికి అమెరికాకు పంపడానికి పవన్ కూడా ఏర్పాట్లు చేశారని బాగా వార్తలు వినిపించాయి.దీంతో పవన్ అభిమానులు అకిరా ఎంట్రీ ఉంటుందని తెగ సంతోష పడ్డారు.

కానీ తాజాగా రేణు దేశాయ్ చెప్పిన మాటల పట్ల అకిరా ఎంట్రీ లేదని తెలుస్తుంది.

Telugu Akira Nandan, Pawan Klayan, Renu Desai, Tollywood-Movie

సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది రేణు దేశాయ్.కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ప్రస్తుతం కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉంటున్నానని తెలిపింది.అలా కొందరు అకిరా గురించి కూడా కొన్ని ప్రశ్నలు వేశారు.

సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయమవుతున్నాడు అని ప్రశ్నించగా.అకిరా ఇప్పుడు సినిమాల్లోకి రాడని అలాంటి ఉద్దేశం కూడా లేదని చెప్పేసింది.

అతను ఇంకా చిన్నపిల్లవాడే అంటూ కేవలం15 ఏళ్ళ ఉన్నాయని ఫస్ట్ అతని చదువు పూర్తి కావాలి.అసలు పెద్దయ్యాక ఏమవుతాడో కూడా తెలియదు.

ముఖ్యంగా అతడికి సినిమాల మీద ఆసక్తి లేదని తెలిపింది.ఏది చేసిన ఆర్ట్స్ లో డిగ్రీ చేస్తాడేమో మ్యూజిక్ నేర్చుకుంటాడు ఏమో అని చెప్పేసరికి మొత్తానికి అకిరా ఇండస్ట్రీ ఎంట్రీ లేదని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube