తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమా పూర్తి కాగానే చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి “లూసిఫర్ “చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో ఎంతో విజయవంతమైన “వేదాళం” చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయనున్నారు.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే బాబి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఈక్రమంలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఒక స్టార్ హీరో, అభిమాని కి మధ్య జరిగే కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఒక హీరో అభిమాని మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో అభిమాని పాత్రలో నటించడం కోసం యంగ్ హీరోను వెతికే పనిలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో చిరు సరసన నటించడం కోసం హీరోయిన్ వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమెకు కథ వివరించగా ఈ సినిమాలో నటించడానికి ఈమె అనుకూలంగా ఉందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే చిరు సరసన సినిమాలో నటించడం కోసం సోనాక్షి సిన్హా ఏకంగా రూ.3.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇంత ఇస్తేనే సినిమాలో నటిస్తానని కరాఖండిగా చెప్పడంతో చిత్రబృందం మరోసారి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అయితే చిరు సరసన సోనాక్షి నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.