సంచలన సవాల్‌కు సిద్ధమైన కోమటి బ్రదర్స్.. జగదీశ్‌కు కత్తి మీద సాము

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ప్రాంతంలోనైనా ఒకే అంశంపైన చర్చ జరుగుతున్నది.అదే ‘హుజురాబాద్ ఉప ఎన్నిక’.

 Komati Brothers Ready For The Sensational Challenge Jagadeesh On The Sword, Kom-TeluguStop.com

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రెక్కలొచ్చాయి.అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించి మరీ పలు పనులకు శ్రీకారం చుడుతున్నది.

మంత్రుల పర్యటనలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది.స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి ‘దళిత బంధు’ స్కీమ్ అమలు, తీరుతెన్నల గురించి చర్చించడానికి ఓ గ్రామ ఎంపీటీసీకి ఫోన్ చేసి సంభాషించడం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే తెలంగాణలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జనాలు.కాగా, భువనగిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తే తాము రాజీనామాకు సిద్ధమంటూ సంచలన సవాల్ విసిరారు నల్లగొండ జిల్లాలో పట్టున్న కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

తన భువనగిరి పార్లమెంటరీ నియెజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తాను రిజైన్ చేయడంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేత కూడా రిజైన్ చేయిస్తానని ఎంపీ కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Telugu Cm Kcr, Congress, Eetala Rajendar, Huzurabad, Jagadeesh Reddy, Komati Bro

ఈ సవాల్ ను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వీకరించాలని కోరారు.ఇకపోతే జిల్లాలో రాజకీయం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉండగా, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంత్రి జగదీశ్ రెడ్డి‌కి మధ్య రాజకీయ వైరం ఉంది.ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌కు మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగిన సంగతి అందరికీ విదితమే.

ఓ కార్యక్రమంలో వీరిరువురు పాల్గొనగా, మాట్లాతున్న క్రమంలో మంత్రి జగదీశ్ మైక్‌ను రాజగోపాల్‌రెడ్డి లాక్కున్నారు.దాంతో కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవలు సద్దుమణిగాయి.అయితే, మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి జగదీశ్‌కు మధ్య రాజకీయ విభేదాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube