ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జంతువులకు సంబందించిన రకరకాల వింతైన వీడియోలు మనకు దర్శనం ఇస్తున్నాయి.ఇప్పుడు అలాంటి వింత అయిన చేప ఒకటి నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.
ఈ చెప యొక్క తల, మూతి గొర్రె ఆకారంలో ఉండగా చేప దంతాలు మనిషి దంతాలను పోలినట్లు చూడడానికి విచిత్రంగా కనిపిస్తోంది.ఈ చేపను చుసిన నెటిజన్లు షాక్ అయ్యి ఈ చేప చిత్రాన్ని అందరికి షేర్ చేస్తున్నారు.
అసలు ఇంతకీ ఈ చేప ఎక్కడ దొరికిందంటే అమెరికాలోని ఉత్తర కరోలినాలోనిది.అక్కడ ఉన్న నాగ్స్ హెడ్‌లో ఆ చేప ఉంది.ఈ విచిత్రమైన చేప పేరు షీప్స్హెడ్.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన షీప్స్హెడ్ ఫిష్ అనే చేపను జెన్నెట్స్ పీర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ లో షేర్ చేసారు.
అది కాస్త వైరల్ అయింది.
నిజానికి ఈ చేప నాథన్ మార్టిన్ అనే మత్స్యకారుడుకు దొరికినది.
షీప్స్హెడ్ ఫిష్ చేపలు ఎక్కువగా జెట్టీలు, రాళ్లు, దిబ్బలు, వంతెనల దగ్గర కనిపిస్తాయట.అలాగే ఈ ఫిష్ కు మరొక పేరు కూడా ఉంది.
సముద్రంలో ప్రయాణించే కొంతమంది ఈ చేపను ‘దోషి‘ చేప అని కూడా పిలుస్తారట.ఈ చేపల బరువు సుమారు 21 పౌండ్లు ఉంటుందట.
అసలు ఈ చేపకు ఈ పేరు ఎలా వచ్చిందంటే.ఈ చేపల చేపల మూతి, తల చూడడానికి గొర్రె ఆకారంలో ఉన్నందున ఈ చేపలకు షీప్స్హెడ్ ఫిష్ అని పేరు వచ్చినట్లు అక్కడ ప్రజలు చెబుతున్నారు.
ఈ చేపలకు మరొక ప్రత్యేకత కూడా ఉందండోయ్.అది ఏంటంటే., ఈ చేపలకు మనుషులకు వలె దంతాలు కూడా ఉండడంతో ఆహారాన్ని నమలడానికి సులువుగా ఉంటుందట.ఈ చేప కోసం క్యూ లైన్ లో నుంచుని మరి కొనుగోలు చేసిన తప్పులేదు అంటున్నాడు మత్స్యకారుడు మార్టిన్.
ఈ చేప తినడానికి చాలా రుచిగా ఉంటుందని మార్టిన్ చెబుతున్నాడు.ఈ చేపను చూసిన నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.