ఆ లైబ్ర‌రీలో అడ్వాన్సెడ్ టెక్నాల‌జీ.. ఎవ‌రు దొంగిలించినా ప‌ట్టేస్తుందంట‌...!

గ్రంథాలయాలు అంటే చ‌దువుకునే వారికి దేవాలయాలతో స‌మానం.అన్ని పుస్త‌కాల క‌ల‌యికే గ్రంథాల‌యాలు.

 Advanced Technology In The Library Whoever Steals It Will Be Punished, Library,-TeluguStop.com

ఒక గ్రంథాల‌యాల్లోనే విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు దొరుకుతాయి.పాఠకులు చదవడం కోసం వీలుగా ఒకదగ్గర చేర్చి ఉంచుతారు.

నిరుద్యోగులు తమ కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాల‌యాల్లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతారు.పుస్తకాలను చదవుకోవడం కోసం, వార్తాపత్రికల వద్ద నుంచి వార, మాస పత్రికలు లేదా ఇతర పుస్తకాలను చదువుకోవడానికి గ్రంథాలయాలు విద్యార్థుల‌కు ఎంత‌గానో ఉపయోగపడతాయి.

అయితే, కొందరు గ్రంథాలయాల్లోని పుస్తకాలను దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.కొన్ని గ్రంథాలయాల్లో పుస్తకాలు చోరీకి గురైన ఎన్నో ఉన్నాయి.

అయితే పుస్తకాలను కాపాడుకోవడం గ్రంథాలయాల నిర్వాహకులకు ఎంతో క‌ష్టంగా ఉండేది.కానీ ఈ గ్రంథాల‌యాల దొంగతనాలకు చెక్ పెట్టెందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

పూణేలోని ఒక గ్రంథాలయంలో ఈ విధానంతో దొంగల పని పడుతున్నారు.

పూణేలోని లక్ష్మీ రోడ్డులో ఒక గ్రంథాల‌యం ఉంది.

ఈ గ్రంథాల‌యం పేరు పూణే నగర్ వచన్ మందిర్.ఈ గ్రంథాల‌యం ఈ సంవత్సరం నూరేళ్ళ పండగ చేసుకోబోతోంది.ఈ గ్రంథాలయంలో దాదాపుగా లక్ష పుస్తకాలు ఉన్నాయి.అంతేగాకుండా ఈ గ్రంథాలయానికి నగరంలో ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి.ఈ గ్రంథాల‌యంతో పాటు, మిగ‌తా ఏడు గ్రంథాల‌యాల్లో పుస్తకాలు చాలా చోరీకి గుర‌వుతూ ఉండేవి.

Telugu Advanced, Theft, Library, Pune Library, Punenagar, Radio Frequency, Thief

దాదాపుగా 20 వేలకు పైగా పుస్తకాలు దొంగ‌లించారు.పెద్దదైన ఈ గ్రంథాలయంలో పుస్తకాలు దొంగతనం కాకుండా చూడటం క‌త్తిమీద సాము లాగా మారింది గ్రంథాల‌య నిర్వాహ‌కుల‌కు.దాంతో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టారు.

దీని పేరే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సిస్టం.ఈ సిస్టంతో పుస్తకాల దొంగలకు చెక్ పెడుతున్నారు.

ఆర్ఎఫ్ఐడీ అనేది వైర్‌లెస్ సిస్టమ్.ఇది రెండు భాగాలు ఉంటుంది.ట్యాగ్‌లు, రీడర్‌లతో ఉంటుంది.ట్యాగ్‌ల‌ను పుస్తకాలలో ఉంచుతారు.

రీడర్లను ఎగ్జిట్ గెట్ వద్ద ఉంచుతారు.

Telugu Advanced, Theft, Library, Pune Library, Punenagar, Radio Frequency, Thief

పుస్తకాన్ని మార్చడానికి ఒక సభ్యుడు లైబ్రరీకి వచ్చినప్పుడు, పుస్తకం తిరిగి రావడం ఈ సిస్టం ద్వారా నమోదు చేస్తారు.అదేవిధంగా, వారు కొత్త‌ పుస్తకాన్ని తీసుకున్న‌ప్పుడు, ఈ సిస్టం కూడా దానిని నమోదు చేస్తుంది.ఎవరైనా ఎక్కువ పుస్తకాలను తీసుకెళ్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే బీప్ శబ్దంతో లైబ్రరీ అధికారులను హెచ్చరిస్తుంది.

ఒకవేళ ఎవరైనా నమోదు చేయని పుస్తకంతో బయటకు వెళితే ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కెమెరా వ్యక్తి చిత్రాన్ని తీసి లైబ్రరీ ఇ-మెయిల్ కు పంపుతుంది.ఇలా పుస్త‌కాల దొంగ‌ల‌ను ప‌ట్టుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube