వామ్మో: కనురెప్పపాటులో 57000 సినిమాలు డౌన్లోడ్..!

ఇప్పుడంత ఇంటర్నెట్ కాలం నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తుంది.

 Vammo: Download 57000 Movies In The Blink Of An Eye . Internet Speed, 57000 Cini-TeluguStop.com

ప్రజలు కూడా ఇంటర్నెట్ కి బాగా అలవాటు పడిపోయారు.ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ నెట్ ఉంటుంది.

రోజురోజుకి నెట్ వినియోగించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు.అలాగే ఇంటర్నెట్ కూడా వేగవంతం చాలా అయిపోతోంది.

మొదట్లో 2G అని తరువాత 3G,4G, 5G అని డేటా అని వచ్చేసాయి.అలాగే చైనా, అమెరికా వంటి దేశాలు ఇంకాస్త ముందుకు వెళ్లి 6G పరీక్ష కూడా ప్రారంభించారు.

అయితే ఇప్పుడు 6G కన్నా వేగాన్ని మించిన ఇంటర్నెట్ ను జపాన్ సాధించింది.

జపాన్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రయోగశాలలో చేసిన పరీక్షల సమయంలో ఇంటర్నెట్ వేగం సెకనుకు 319 టెరాబైట్లకు (TB) వచ్చింది.

గత సంవత్సరం ఇదే పరీక్షలో, ఈ వేగం సెకనుకు 178 టెరాబైట్ కి వచ్చింది.ఈ సంవత్సరం ఇంకా పెరిగిందన్నమాట.

ఈ వేగంతో మీరు సెకనులో 57,000 సినిమాలను డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు అంటే ఎంత వేగమో మీరే ఆలోచించుకోండి.ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ లోనే కొన్ని రకాల మార్పులు చేయడం ద్వారా జపాన్ ఈ విజయం సాధించింది.

ఈ వేగాన్ని పొందడానికి జపాన్ ల్యాబ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ ను ఉపయోగించింది.

Telugu Cinimas, Speed, Net Speed, Ups, Latest-Latest News - Telugu

జపాన్ ల్యాబ్‌ లో చేసిన ఈ పరీక్ష నివేదికను పోయిన నెలలో అంతర్జాతీయ సమావేశంలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్స్‌ లో సమర్పించారు.వాళ్ళు ఇందుకోసం 3001 కి.మీటర్ల పొడవున ప్రసారం చేయడానికి ఎన్‌ఐఐసిటి సిద్ధం చేసిందని వెల్లడించారు.ఈ వేగాన్ని సాధించడానికి పరిశోధకులు వివిధ తరంగ దైర్ఘ్యాల కోసం ప్రత్యేక లోహంతో తయారు చేసిన యాంప్లిఫైయర్, 552 ఛానల్ కూంబ్ లేజర్‌ ను ఉపయోగించినట్లు తెలుస్తుంది.ఈ ప్రయోగం ఇంకా అందుబాటులోకి రావాలంటే చాలా సమయం పడుతుందనే చెప్పాలి.

జపాన్ కనిపెట్టిన ఈ ఇంటర్నెట్ వేగంతో అతి కొద్ది సమయంలోనే ఎటువంటి పెద్ద ఫైల్ అయినాగానీ చిటికెలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube