ఆ కంపెనీలో చేరితే చాలు బీఎమ్‌డబ్ల్యూ బైక్‌లు, ఐప్యాడ్‌లు ఉచితం..!

ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ భారత్‌ పే ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.తమ కంపెనీలో ఉద్యోగం పొందితే చాలు వారందరికీ లక్షల విలువైన బీఎమ్‌డబ్ల్యూ బైక్‌లు ఉచితంగా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది.2022 ఆర్థిక సంవత్సరం నాటికి తమ టెక్ టీమ్ ని విస్తరించాలని నిర్ణయించుకున్న కంపెనీ టెకీలను ఆకర్షించేందుకు బీఎమ్‌డబ్ల్యూ బైక్ లు ఇస్తామని వెల్లడించింది. మర్చంట్ అండ్ కన్సూమర్ లెండింగ్ స్పేస్ లో చాలా ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న భారత్ పే కంపెనీలో టెక్నాలజీ విభాగంలో కొత్తగా 100 మంది ఉద్యోగుల వరకు అవసరమవుతారు.

 All You Have To Do Is Join The Company And Get Bmw Bikes And Ipads For Free  Bha-TeluguStop.com

దీంతో కంపెనీలు త్వరగా తమ టెక్నాలజీ టీమ్ ని 3 రెట్లు పెంచాలని తెలివైన నిర్ణయాలు తీసుకుంటోంది.తాజాగా ఒక ప్రకటన విడుదల చేసిన భారత్ పే 100 మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయని వెల్లడించింది.

అయితే కంపెనీలో జాయిన్ అయిన ఉద్యోగస్తులు బైక్ లేదా గ్యాడ్జెట్ ప్యాకేజ్ లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.బైక్ ప్యాకేజ్ లో బీఎమ్‌డబ్ల్యూ జీ310ఆర్, జావా పెరక్ , కేటీఎం డ్యూక్ 390, కేటీఎం ఆర్సీ 390, రాయల్ ఎన్ఫిల్డ్ హిమాలయన్ వంటి 5 సూపర్ బైక్స్ ఉంటాయి.గ్యాడ్జెట్ ప్యాకేజీలో ఆపిల్ ఐపాడ్ ప్రో (విత్ పెన్సిల్ ), బోస్ హెడ్ ఫోన్ , హార్మాన్ కార్డున్ స్పీకర్ , సాంసంగ్ గెలాక్సీ వాచ్, డబ్ల్యూఎఫ్హెచ్ డెస్క్ అండ్ చైర్, ఫైర్ ఫాక్స్ టైఫాన్ 27.5 డీ బైసైకిల్ ఉంటాయి.

Telugu Bharath Pay, Bike Offers, Bmw, Pads, Latest Offers-Latest News - Telugu

అయితే ఈ ప్యాకేజీలతోపాటు టెక్నాలజీ టీమ్ ని 2021, నవంబర్ 14న దుబాయ్ లో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచులకు ఉచితంగా తీసుకెళ్తుంది.ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మంచి టాలెంట్ ఉన్న ఉద్యోగులను భారత్‌పే కంపెనీకి రెఫర్ చేస్తే కూడా ఈ ప్యాకేజీలు లభిస్తాయి.ఆర్థిక సేవలను టెక్నాలజీ సహాయంతో అత్యంత వేగంగా అందిస్తున్న “భారత్ పే టెక్ ఏర్పాటు చేసిన తొలి ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పుకోవచ్చు.

భారతదేశంలో నెక్ట్స్ జనరేషన్ కి తగ్గట్టు బ్యాంకింగ్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ప్రతిభావంతులైన ఉద్యోగులను ప్రోత్సహించి ఉత్తమ ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేయాలని భావిస్తున్నామని భారత్ పే కో-ఫౌండర్, సీఈవో అష్నిర్ గ్రోవర్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube