ఏజెంట్ కోసం నానా కష్టాలు పడుతున్న నాగ్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ దూకుడుమీద ఉన్నాడు.కాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

 Nagarjuna Working Hard For Akhil Agent, Nagarjuna, Akhil Akkineni, Agent, Surend-TeluguStop.com

అఖిల్ తన కెరీర్‌లో పలు సినిమాలు చేసినా కూడా కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.దీంతో ఈ సినిమాతో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని అఖిల్ చూస్తున్నాడు.

కాగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అఖిల్ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఏజెంట్ అనే సినిమాలో అఖిల్ నటిస్తున్నాడు.

ఈ సినిమా కోసం అఖిల్ తన ఫిజికల్ లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు.ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.దీనికి తగినట్లే ఈ సినిమాలో భారీ తారాగణంను ఆయన తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఏజెంట్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే మమ్ముట్టి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించింది మాత్రం అక్కినేని నాగార్జున అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అఖిల్‌ను పూర్తి మేకోవర్‌లో చూసిన నాగ్, ఏజెంట్ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయి చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఇందులో భాగంగానే ఏజెంట్ క్యాస్టింగ్ విషయంలో నాగ్ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాడట.

అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మమ్ముట్టి నటించాలని నాగ్ ఆయన్ను కోరగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇక మిగతా నటీనటుల విషయంలో కూడా నాగ్ చాలా ఆసక్తిని చూపుతున్నాడట.

మొత్తానికి ఏజెంట్ చిత్రంతో అఖిల్‌ను ఓ రేంజ్ యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసేందుకు నాగ్ చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నాడు.మరి నాగ్ కష్టానికి ఏజెంట్ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube