ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో ఆకుకూరలు ముందు వరసలో ఉంటాయి.అటువంటి ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్న సంగతి తెలిసిందే.
వాటిలో ఎర్ర తోటకూర కూడా ఒకటి.మామూలు తోట కూరతో పోలిస్తే ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువే.
మరియు ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలూ ఎక్కువే.మరి ఆలస్యం చేయకుండా ఎర్ర తోటకూరలో ఉండే పోషకాలు ఏంటీ? అవి అందించే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి ఎర్ర తోటకూర ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా వారానికి ఒకటి, రెండు సార్లు ఎర్ర తోటకూరను తీసుకుంటే అందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా మారేందుకు సహాయపడుతుంది.
అలాగే అధిక రక్త పోటుతో బాధ పడే వారు ఎర్ర తోట కూరను డైట్‌లో చేర్చుకోవాల్సిందే.ఎందుకంటే, రక్త పోటు స్థాయిలను అదుపు చేయడంలో ఎర్ర తోటకూర ఉపయోగపడుతుంది.ఎర్ర తోటకూర తీసుకోవడం వల్ల గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
అంతేకాదు, ఎర్ర తోటకూరను తీసుకోవడం వల్ల రక్త హీనత పరార్ అవుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.ఇక గర్భిణీలకు కూడా ఎర్ర తోటకూర ఎంతో మంచిది.ప్రెగ్నెన్సీ సమయంలో ఎర్ర తోటకూరను తీసుకుంటే.
అందులో ఉండే పోషకాలు తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడతాయి.