సినిమాలకి గుడ్ బై చెబుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

తమిళ్ డబ్బింగ్ మూవీ రంగంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన అందాల భామ కార్తిక.ఈ బ్యూటీ అలనాటి ఎవర్ గ్రీన్ నటి రాదా పెద్ద కూతురు అనే సంగతి అందరికి తెలిసిందే.

 Karthika Nair To Quit Movies, Tollywood, Rangam Movie, Dammu Movie, Kollywood-TeluguStop.com

తల్లి వారసత్వంతోనే ఈ అమ్మడు నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.తల్లి ఇమేజ్ కారణంతో ఆరంభంలో అవకాశాలు భాగానే వచ్చిన కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

తెలుగులో దమ్ము సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కార్తిక ఆడిపాడింది.తరువాత బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అనే సినిమాలో అల్లరి నరేష్ చెల్లిగా నటించింది.

అయితే తెలుగులో ఈమె చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

Telugu Dammu, Karthika Nair, Kollywood, Rangam, Tollywood-Movie

దీంతో మళ్ళీ మాతృభాష మీదనే ఫోకస్ పెట్టింది.అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే అదే సమయంలో హిందీలో ఓ హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ సీరియల్ లో కార్తికకి అవకాశం వచ్చింది.

అలాగే శివగామి కథతో తెరకెక్కే సీరియల్ కోసం ఈమెని ఎంపిక చేసారని అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే ఎన్ని చేసినా కూడా కార్తికకి అనుకున్న గుర్తింపు అయితే రాలేదు.

తల్లి స్థాయిలో రాణించలేకపోయింది.దీంతో ఇక అవకాశాల కోసం టైం వేస్ట్ చేయడం అనవసరం అని ఫిక్స్ అయిన ఈ బ్యూటీ తమ ఫ్యామిలీ వ్యాపారాల మీద కంప్లీట్ గా దృష్టి పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ఒక వేళ తనని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే చేయడం తప్ప హీరోయిన్ వేషాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదని కూడా ఆమె మెంటల్ గా ఫిక్స్ అయ్యి వ్యాపారాలని చూసుకోవడం మొదలు పెట్టిందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube