మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి గుమ్మడికాయ కొట్టబోతున్నారు.
ఇదిలా ఉంటే దీని తర్వాత చిరంజీవి వరుసగా మూడు సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.అందులో రెండు రీమేక్ మూవీలు కాగా ఒకటి బాబీ దర్శకత్వంలో స్ట్రైట్ మూవీ కూడా ఉంది.
ఇక ఈ మూడు సినిమాలకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.అయితే వీటిలో దేనిని ముందు సెట్స్ పైకి తీసుకెళ్ళాలి అనే విషయంలో మాత్రం చిరంజీవి కొంత గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రెండు రీమేక్ సినిమాలని ఒకే సారి స్టార్ట్ చేయాలని షెడ్యూల్స్ కూడా బ్యాక్ టూ బ్యాక్ వేసి తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే విధంగా చూడాలని చిరంజీవి దర్శకులకి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం.
దానికి తగ్గట్లే ఆయా చిత్రాల దర్శకులు ప్లాన్ చేస్తున్నారు.ఈ లోపు డైరెక్టర్ బాబీతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోయే సినిమాని ముందుగా స్టార్ట్ చేయడానికి చిరంజీవి సిద్ధమయ్యారని టాక్.ఈ నేపధ్యంలో బాబీకి చిరు క్లారిటీ ఇవ్వడంటో అతను షూటింగ్ కోసం షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఆమెకి కథని కూడా నేరేట్ చేయడం జరిగిందని, ఆమె కూడా చిరంజీవికి జోడీగా కనిపించడానికి ఒకే చెప్పిందని సమాచారం.
త్వరలో దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.