ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతూ ఉండటంతో వచ్చే నెలలో టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పటం జరిగింది.దీంతో నారా లోకేష్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునే ప్రసక్తి లేదని పరీక్షలను రద్దు చేయాలని మళ్లీ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ఒక పక్క మహమ్మారి కరోనా విజృంభిస్తున్న గానీ పరీక్షల విషయంలో దూకుడు గానే వ్యవహరిస్తూ ఉంది.
ఈ తరుణంలో నారా లోకేష్ మొదటి నుండి పరీక్షల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనకడుగు వేయాలని విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పెట్టకూడదు అని చెప్పు వస్తూ ఉన్నారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పరీక్షలు అంటూ వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో ఈసారి ఊరుకునే ప్రసక్తి లేదని పరీక్షల విషయంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని లోకేష్ తాజాగా చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని నారా లోకేష్ ప్రభుత్వానికి సూచించారు.